BigTV English

Chamala Comments: జీప్ ఎక్కి మాట్లాడటం కాదు.. ప్రజల కష్టాలను చూడాలి: చామల

Chamala Comments: జీప్ ఎక్కి మాట్లాడటం కాదు.. ప్రజల కష్టాలను చూడాలి: చామల

MP Chamala Kiran Kumar Reddy Comments: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు ప్యాకేజీని విడుదల చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తెలంగాణలో పర్యటించి, జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదు. యువరాజు కేటీఆర్, ఎలెన్ మస్క్ x ప్లాట్ పామ్ మీద ఉండి మాట్లాడుతున్నారు.


Also Read: ఒవైసీకి భయపడే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం లేదు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

కేటీఆర్ సోషల్ మీడియా(ఎక్స్)లో మెసేజ్ లు పెట్టి నవ్వుల పాలు అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ పాలన మీద సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైడ్రాపై కోర్టు తీర్పు ఇచ్చినట్లు కేటీఆర్ వక్రీకరిస్తున్నాడు. హైడ్రాపై ప్రజలను తికమక పెట్టడానికి కేటీఆర్ అలా చేస్తుండు. హైడ్రాను బుల్డోజర్ తో పోల్చి తికమక పెట్టొద్దు. బీఆర్ఎస్ లో రెండు గ్రూప్ లు ఉన్నవి. ఖమ్మంలో రెండు బీఆర్ఎస్ గ్రూప్ లు కొట్టుకుంటే, కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు పెట్టారు.


Also Read: హరీశ్‌రావు.. ఫస్ట్ ఆ మైకం నుంచి బయటకు రా.. ఎందుకు అనవసరంగా అరుస్తున్నావ్? : జగ్గారెడ్డి

కేటీఆర్ ఇప్పుడు ఏ దేశంలో ఉండో ఎవరికి తెలియదు. కేటీఆర్ దయా దాక్షిణ్యాలతో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఎక్కడికి పోయారు. ఓపెన్ టాప్ జీప్ ఎక్కి మాట్లాడటం కాదు ప్రజల కష్టాలను తీర్చాలి. ఎంత ఒత్తిడి వచ్చినా రేవంత్ రెడ్డి హైడ్రాను ముందుకు తీసుకువెళ్తారు. హైదరాబాద్ లో లేక్స్ ను కాపాడుతామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టారు. ప్రజాపాలన అందియ్యాలన్నదే మా ప్రభుత్వ పట్టుదల. ప్రజల కోసం మంచి చేసే హైడ్రాపై మీ డ్రామా ఏంటి..?’ అంటూ చామల మండిపడ్డారు.

Related News

Revanth Reddy: బీసీల హక్కుల కోసం కట్టుబడి ఉన్నాం.. గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Gandhi Hospital: భార్యతో గొడవ… బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్… చివరికి గాంధీ వైద్యుల అద్భుతం!

Congress PAC: ఓటు చోరీపై కాంగ్రెస్ దూకుడు.. PAC కీలక నిర్ణయాలు!

Hyderabad rains: హైదరాబాద్ వర్షాల కొత్త అప్‌డేట్.. వాతావరణం చల్లగా, గాలులు వేగంగా.. తస్మాత్ జాగ్రత్త!

Bhupalpally: ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్

Suryapet Crime: పట్ట పగలే ముగ్గురిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Big Stories

×