Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని నెమ్మదిగా కదిలే గ్రహంగా చెబుతారు. శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి రెండున్నర ఏళ్ల సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం శని మూలత్రికోణ రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. శని మార్చి 2025 వరకు ఈ రాశిలోనే సంచరిస్తాడు. శని తన రాశిలోనే ఉంటూ ఎప్పటికప్పుడూ తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కొన్ని సార్లు శని తిరోగమనం దిశలో సంచరిస్తాడు.
జూన్ 29. 2024 నుంచి కుంభ రాశిలో శని తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు. 15 నవంబర్ 2024 సాయంత్రం 05.09 గంటలకు కుంభ రాశిలో శని ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభించనుంది. కుంభ రాశిలో శని ప్రత్యక్ష సంచారం వల్ల అన్ని రాశుల వారి జీవితంపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా దీపావళి నుంచి శని సంచారం కొన్ని రాశుల వారి కష్టాలు తీరిపోనున్నాయి.
మిథున రాశి: కుంభ రాశిలో శని సంచారం వల్ల మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్టం, తొమ్మిదవ ఇంట్లో శని సంచరిస్తున్నాడు. ఈ సమయంలో జీవితంలో ప్రతి అంశంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన లాభం కలగడంతో పాటు రుణ విముక్తి కూడా కలుగుతుంది. సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆఫీసుల్లో సీనియర్ అధికారులు మీకు మద్ధతుగా కనిపిస్తారు. కెరీర్లో మంచి పేరు సంపాదించుకనేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం.
మేష రాశి: శని సంచారం మేష రాశికి అనేక ప్రయోజనాలు తెస్తోంది. ఆత్మవిశ్వాసం పెరిగి వివిధ రంగాల్లో విజయం సాధించగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక సంక్షోభం వల్ల బాధలు పెరుగుతాయి. ఆఫీసుల్లో ఎదుర్కుంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇప్పడు కొలిక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని సవాళ్లను విజయవంతంగా ఎదుర్కునేందుకు ఇది మంచి సమయం.
Also Read: 100 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం..ఈ 3 రాశులకు సంపద పొంగిపోతుంది
మకర రాశి: శని ప్రత్యక్ష సంచారం వల్ల మకర రాశి చాలా వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సౌకర్యాలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ప్రేమతో పాటు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కష్టాలు తగ్గుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి. ఆఫీసుల్లో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)