EPAPER

Jaggareddy: హరీశ్‌రావు.. ఫస్ట్ ఆ మైకం నుంచి బయటకు రా.. ఎందుకు అనవసరంగా అరుస్తున్నావ్? : జగ్గారెడ్డి

Jaggareddy: హరీశ్‌రావు.. ఫస్ట్ ఆ మైకం నుంచి బయటకు రా.. ఎందుకు అనవసరంగా అరుస్తున్నావ్? : జగ్గారెడ్డి

Jaggareddy Comments on KTR and Harishrao: ఐదు రోజుల నుంచి వర్షాలు తెలంగాణ, ఆంధ్రాలో కురుస్తున్నాయి. పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో చెరువులు, వాగులు అలగులు పడుతున్నాయి. జంట నగరాల్లో కూడా ఎప్పుడు వర్గాలు ఎక్కువగా కురుస్తున్నాయి… ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇండ్లు మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మూడు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారు.


Also Read: తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?

సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించారు. మహబూబాబాద్ లో కూడా మంత్రి సీతక్క అక్కడే ఉన్నారు.. సీఎం కూడా పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల పరిస్తితి మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారు.. సూర్యాపేట, హుజూర్ నగర్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారు.


ఇప్పటికే రూ. 7 వేల కోట్ల నష్టం జరిగింది. తక్షణ సాయం కోసం కేంద్రం రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ప్రధానికి లేఖ రాశారు. ప్రతిపక్ష నేతలు ఖమ్మంలో పర్యటించిన నేతలు సూచనలు ప్రభుత్వానికి చేయండి. పవర్ పోయినా ఆ మైకం నుంచి హరీష్ రావు బయటకు రావడం లేదు. ప్రతిపక్షం ఎలా ఉండాలి అనేది కాంగ్రెస్ పక్షాన నేను ట్రైనింగ్ ఇస్తాను. ప్రభుత్వం, ప్రతిపక్షం మొదట ప్రజలను ఫేస్ జోన్ లోకి తేవాలి. ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదు. ప్రభుత్వం మీద బురద జల్లేందుకు చంద్రబాబును బీఆర్ఎస్ ను మెచ్చుకుంటుంది. బీఆర్ఎస్ ఎప్పుడు చంద్రబాబును మెచ్చుకుంటారో.. తిడతారో తెలియదు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా.. గతంలో సీఎంగా ఉన్న కేసిఆర్ ఇప్పుడు ఇంట్లో ఉండి నడిపిస్తున్నారు.. అది ఆయన ఇష్టం.. విమర్శలు చేయం.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చాలా వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ శ్రద్ధగా పని చేస్తుంది.. కానీ ప్రచారంకు ప్రియారిటీ ఇవ్వదు. బీఆర్ఎస్ 90 శాతం పబ్లిసిటీ చేసి.. 10 శాతం పని చేస్తారు. ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు వంద శాతం ప్రియారిటీ ఇస్తుంది.

Also Read: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం విద్య పట్ల.. పేద విద్యార్థుల పట్ల ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అన్ని రంగాల్లో విద్యా రంగం అభివృద్ధి చెందింది అంటే.. కాంగ్రెస్ వేసిన పునాదులే. నెహ్రూ నుండి మొదలుకుని.. ఇందిరాగాంధీ.. రాజీవ్ గాంధీ.. సోనియాగాంధీ… ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు విద్య పట్ల ప్రోత్సాహం ఇస్తుంది. ఐఐటీ లాంటి విద్యాసంస్థలు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది. విదేశాల్లో కూడా ఐఐటీ విద్యార్దులకు ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. కేసీఆర్ అధికారంలో అన్న పదేళ్లు పేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. కేసీఆర్..కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఆ మాట నిలుపుకోలేదు. పేద విద్యార్దులకు వెన్నుపోటు పొడిచారు కేసీఆర్. ప్రభుత్వ స్కూల్స్ లో ఇప్పటికీ చదివేవారు ఉన్నారు..కానీ వసతులు లేవు. ఇప్పుడున్న వసతులు కూడా మేము చేసినవే..కేసీఆర్ ఏం చేయలేదు.

ప్రక్షాళన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఏర్పాటుతో విద్యాసంస్థలలో మార్పు వస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ నియంత్రణ కోసమే కమిషన్ ఏర్పాటు. సీఎం రేవంత్.. కేసీఆర్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినవారే. కానీ, కేసీఆర్ మర్చిపోయాడు.. మనం మర్చిపోలేదు. నేనైనా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐనా సర్కార్ బడిలో చదివిన వారే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా పైలెట్ అయ్యారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను కూని చేసింది. అందుకే.. అన్ని గ్రామాల్లో విద్యను అన్ని వసతులతో కల్పించాలని కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పేరెంట్స్ కమిటీలు కూడా మళ్ళీ రాబోతున్నాయి. ప్రైవేటు స్కూల్స్ ఫీజులు కమిషన్ కట్టడి చేస్తది.

Related News

Hydra police: మరింత పటిష్టంగా హైడ్రా.. ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది..

Medical Colleges: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

New Medical Colleges: తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

Loan Waiver: మాఫీ కాలే.. ఇదుగో రుజువు.. ఆ ఊరిలో ఒక్కరికైనా మాఫీ కాలేదు: కేటీఆర్

TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

Chakali Ailamma: బ్రేకింగ్ న్యూస్.. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు

Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

×