OTT Movie : ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తోందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎంటర్టైన్ కోసం ఆడియన్స్ వీటినే సెర్చ్ చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలకోసం ఓటీటీ సంస్థలు పోటీ పడి దక్కించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ బోల్డ్ థీమ్ తో వచ్చి రచ్చ చేస్తోంది. ఈ కథ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కాబోయే కోడలితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు ఒక మహానుభావుడు. లండన్‌లో ఈ కథ నడుస్తుంది. ఇందులో రొమాంటిక్ సీన్స్ హద్దులు దాటిపోతాయి. కాబట్టి దీనిని ఒంటరిగానే చూడటం మంచిది. ఈ సినిమా పేరు ? స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే.
నెట్‌ఫ్లిక్స్‌లో
‘ఒబ్సెషన్’ (Obsession) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన బ్రిటిష్ ఎరోటిక్ థ్రిల్లర్ సిరీస్. జోసెఫిన్ హార్ట్ 1991లో రాసిన ‘డ్యామేజ్’ నవల ఆధారంగా మోర్గాన్ మాల్కమ్, బెన్జి వాల్టర్స్ రూపొందించారు. నాలుగు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ లో రిచర్డ్ బెక్‌మన్ (విలియం ఫిచ్నర్), ఇండిరా వర్మ (అన్నా బార్టన్), చార్లీ మర్ఫీ (జే), రోసి డి పాల్మా (ఇంగ్రిడ్), పిప్పా బెన్నెట్-వార్నర్ (సాలీ) నటించారు. IMDbలో ఈ సిరీస్ కి 5.2/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
విలియం లండన్‌లో ఒక ప్రముఖ సర్జన్. తన భార్య ఇంగ్రిడ్, కొడుకు జే తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. జే తన కాబోయే భార్య అన్నా బార్టన్ ను, ఒక పార్టీలో తన తండ్రి విలియంకు పరిచయం చేస్తాడు. అప్పుడే విలియం, అన్నా మధ్య ఒక అట్రాక్షన్ మొదలవుతుంది. ఈ అట్రాక్షన్ అంతటితో ఆగకుండా, మరో మలుపు తీసుకుంటుంది. కొడుకుకి కాబోయే భార్య అనికూడా చూడకుండా, ఆమెతో ఆపని మొదలుపెడతాడు విలియం. వీళ్ళిద్దరూ పారిస్‌లోని ఒక ఫ్లాట్‌లో సన్నిహితంగా గడుపుతుంటారు. అన్నా తన కోరికలను విలియంతో తీర్చుకుంటుంది. ఈ సీన్స్ చూసి ఆడియన్స్ కూడా తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది.
విలియం అబ్సెషన్ అతని వృత్తిపరమైన జీవితాన్ని, కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తుంది. అతను అన్నాతో ఎక్కువ సమయం గడపడం వల్ల, జే కి వీళ్ళ మీద అనుమానాలు కలుగుతాయి. అన్నాస్నేహితురాలు సాలీ ఈ సంబంధం గురించి విలియంను హెచ్చరిస్తుంది. కానీ విలియం ఆమె హెచ్చరికలను పట్టించుకోడు. తన జీవితాన్ని నాశనం చేసే మార్గంలో మునిగిపోతాడు. ఇక విలియం అబ్సెషన్ అతన్ని నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. అతని పనిలో పొరపాట్లు జరుగుతాయి. కుటుంబంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. జే కి వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం తెలిసిపోతుంది. ఇది అతని పెళ్లి, కుటుంబ బంధాలను నాశనం చేస్తుంది. చివరిగా జే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? అన్నా విలియంతో ఎందుకు అలాంటి పని చేస్తుంది ? ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : చావు ఇంట్లో చక్కిలిగింతలు… 16 గంటల్లో సాగే స్టోరీ… ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ కామెడీ డ్రామా