E-Paper
Advertisement

TGSPDCL: వాట్సాప్‌లో ఈ నెంబర్‌కి హయ్ అని పెడితే చాలు.. విద్యుత్ సమస్యలు పరిష్కారం..!

TGSPDCL: వాట్సాప్‌లో ఈ నెంబర్‌కి హయ్ అని పెడితే చాలు.. విద్యుత్ సమస్యలు పరిష్కారం..!
Advertisement

TGSPDCL: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) తన వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించినట్లు సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ వాట్సాప్‌లో 8712441912 నంబర్‌ను సేవ్ చేసుకుని ‘Hi’ అని మెసేజ్ పంపడం ద్వారా ఫిర్యాదుల నమోదు, బిల్లింగ్ వివరాలు, విద్యుత్ సరఫరా స్థితి సమాచారం వంటి వివిధ సేవలను సులభంగా పొందవచ్చని తెలిపారు.

Also Read: Chilli Farmers: మిరప రైతులను మింగేస్తున్న తెగుళ్ల ఘాటు.. నష్టాలతో అన్నదాతల ఆవస్థలు

ఎప్పుడైనా, ఎక్కడైనా..

Advertisement

దీనిద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యుత్‌కు సంబంధించిన సమాచారాన్ని వేగంగా పొందగలుగుతారన్నారు. ప్రతి వినియోగదారుడు ఈ నంబర్‌ను తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవడం ద్వారా విద్యుత్ సేవలను మరింత సులభంగా, సురక్షింతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సర్వీస్ ద్వారా దీనికి తోడు మీ బిల్లు పెండింగ్ ఉందని, బిల్లు కట్టకుంటే ఈ రాత్రి కరెంట్ కట్ చేస్తామని, అర్జెంటుగా ఫలానా నంబర్ కు కాల్ చేయండి? అని మెసేజ్ లు పంపి అమాయకులను దోచుకునే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కూడా ఆస్కారముందని తెలిపారు. బిల్ పై ఏ డౌట్ ఉన్నా వెంటనే ఈ సదుపాయం ద్వారా క్షణాల్లో సమాచారం పొంది అప్డేట్ తీసుకుని మోసగాళ్ల బారిన పడకుండా ఉండొచ్చని ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ అతి త్వరలోనే వాయిస్ బాట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

Also Read: Vangaveeti Asalatha: వైసీపీ వ్యవహారం.. వంగవీటి ఆశాలత క్లారిటీ, టార్గెట్ ఫిక్సయినట్టే?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×