E-Paper
Advertisement

Cm Revanth : రేవంత్ మళ్లీ పిలిచారు.. ఈసారైనా గులాబీ నేతలు వెళ్తారా?

Cm Revanth : రేవంత్ మళ్లీ పిలిచారు.. ఈసారైనా గులాబీ నేతలు వెళ్తారా?
Advertisement

గోదావరి నదీ జలాల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నదీ జలాల అంశంలో ఉదాసీనతగా వ్యవహరిస్తూ పక్కరాష్ట్రాలకు మేలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి స్పందించారు. నిన్న దేవాదుల ఎత్తిపోతల పాయింట్‌ను పరిశీలించిన ఆయన.. అధికారులు, మంత్రులతో కలిసి ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నదీ జలాల అంశంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు జవాబులు ఇచ్చారు. ముందుగా దేవాదుల ఎత్తిపోతలను రెండేండ్లలో పూర్తి చేస్తామని సీఎం స్పష్టంచేశారు.అంతేకాకుండా గోదావరి నదీపై నిర్మిస్తున్న పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రకటించారు.

విషం కక్కడం మానుకోండి..

బీఆర్ఎస్ నేతలు నదీ జలాల అంశంలో విషం కక్కడం మానుకోవాలని సీఎం రేవంత్ వారికి హితవు పలికారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉందని.. కనీసం రెండు నుంచి మూడేండ్లు పెండింగ్ ప్రాజెక్టులపై నాడు దృష్టి సారించి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తి అయ్యేవని.. అప్పుడు కంప్లీట్ చేయకపోవడం వలన నేడు వాటి అంచనా వ్యయం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారని గుర్తుచేశారు.ఈ పాపం బీఆర్ఎస్ వాళ్లది కదా? అని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రమే హైలెట్ చేసి..పాలమూరు రంగారెడ్డి, దేవాదుల, ఎల్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగాయని.. రాష్ట్రంలో నిధుల కొరత తీవ్రంగా ఉన్నదని వివరించారు.
కాళేశ్వరం కోసం వివిధ కార్పొరేషన్ల నుంచి అడ్డగోలుగా కేసీఆర్ అప్పులు తేవడం వలన నిధులు సమకూర్చడం కష్టంగా మారిందన్నారు.

చర్చ పెడతాం..సభకు రండి..

Advertisement

గోదావరి, కృష్ణా నదీ జలాల అంశంలో బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం మానుకోవాలని.. సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తే బాగుంటుందని.. తమ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే సరిద్దాలని.. సూచనలు చేస్తే స్వాగతిస్తామన్న రేవంత్ రెడ్డి.. బడ్జెట్ సమావేశాల్లో గోదావరి నదీ జలాలపై చర్చ పెడదామని.. సభకు రావాలని బీఆర్ఎస్ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో పూర్తయి ఉంటే మిగులు జలాలా అంశంపై ఇతర రాష్ట్రాలతో మాట్లాడటానికి అవకాశం ఉండేదన్నారు. పెండింగ్ పూర్తి కాకుండా మిగులు జలాలు కావాలని ఎలా అడుగుతారని పొరుగు రాష్ట్రం నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న విషయాన్ని సీఎం రేవంత్ గుర్తుచేశారు.

తన్ని తరిమేస్తాం.. బీఆర్ఎస్‌పై ఏపీ మంత్రికి ఎందుకంత కోపం?

Advertisement

రాబోయే రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేస్తామన్నారు.తెలంగాణలో ప్రతి ఎకరానికీ సాగునీరు, ప్రతి పౌరుడికీ తాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ముఖాముఖి కూర్చొని మాట్లాడుకుందామని సీఎం అన్నారు. గోదావరి జలాలపై బీఆర్ఎస్ సాధించిందేమిటో, తమకు అప్పగించిన వారసత్వం ఏమిటో, తాము చేసిన తప్పిదాలు ఏమిటో విపులీకరించి చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. తాము ఏదైనా పొరపాటు చేసి ఉంటే దాన్ని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు ఆలోచనలో మార్పు రావాలని, మీ తప్పులకు ప్రజలను తప్పుబట్టడం మానేయాలని, విషం కక్కవద్దన్నారు. నదీ జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడతామన్నారు.మేడిగడ్డ బ్యారేజీని అలాగే గాలికి వదిలేయకుండా రిపేర్లు చేయిస్తామని.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు మంజూరు చేస్తామన్నారు.కాగా, సీఎం రేవంత్ ఆహ్వానాన్ని ఈసారైనా బీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సిందే.

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×