E-Paper
Advertisement

Vangaveeti Asalatha: వైసీపీ వ్యవహారం.. వంగవీటి ఆశాలత క్లారిటీ, టార్గెట్ ఫిక్సయినట్టే?

Vangaveeti Asalatha: వైసీపీ వ్యవహారం.. వంగవీటి ఆశాలత క్లారిటీ, టార్గెట్ ఫిక్సయినట్టే?
Advertisement

Vangaveeti Asalatha: ఏపీ రాజకీయాల్లో కొత్త కొత్త పరిణామాలు వెలుగు చూస్తున్నాయా? కూటమిని విడగొట్ట లేకపోయినా కాపుల్లో మెజార్టీ వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? ఓ వైపు వంగవీటి రాధ.. మరోవైపు ఆశాలతతో మంతనాలు సాగిస్తుందా?  ఇక్కడే వంగవీటి ఫ్యామిలీ జాగ్రత్తగా అడుగులు వేస్తోందా? తమ నిర్ణయాన్ని బయట పెట్టకుండా కొంతమంది వ్యక్తులకు కమ్యూనిటీ పరంగా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా వంగవీటి ఆశాలత తన రాజకీయాలపై గురించి మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

వంగవీటిరంగా.. ఆశాలత చుట్టూ తిరుగుతున్న వైసీపీ రాజకీయాలు

Advertisement

ఏపీలో కొంతకాలంగా వంగవీటి కూతురు ఆశాలత రాజకీయ నిర్ణయాలపై ఆ కమ్యూనిటీ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. శనివారం రాత్రి ఓ కార్యక్రమంలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో వంగవీటి ఆశాలత తన టార్గెట్ ఏంటో స్పష్టంగా తేల్చి చెప్పారు. రాజకీయ నేతల మాదిరిగా ఎక్కడా వేగంగా నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆమె.

అంతేకాదు తన రాజకీయ భవిష్యత్‌పై మరోసారి స్పష్టత ఇచ్చారు ఆశాలత. రాజకీయాలపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కుండబద్దలు కొట్టేశారు. రంగా అభిమానుల కోసం రంగా-రాధ మిత్ర మండలిని నడుపుతున్నట్లు చెప్పారు. తన రాజకీయ నిర్ణయానికి – రాధా రంగా మిత్ర మండలికి ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశారు.

Advertisement

ఆ వార్తలకు ఫుల్‌స్టాప్.. మరోసారి వంగవీటి ఆశాలత క్లారిటీ

మిత్ర మండలిలో అన్ని పార్టీల వారు ఉన్నారని, అది స్వచ్ఛంధ ఆర్గనైజేషన్ కింద వెళ్లాలని భావిస్తున్నట్లు మనసులోని మాటను బయటపెట్టారు. తొలుత మిత్ర మండలిపై ఫోకస్ చేస్తున్నానని తేల్చి చెప్పారు. తన రాజకీయ నిర్ణయం తర్వాత ఉంటుందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. సేవా కార్యక్రమాలకు- రాజకీయాలకు లింకు చేయకుండా జాగ్రత్త పడుతున్నట్లు వెల్లడించారు.

తన తండ్రి మాదిరిగా ఏ కులానికి, మతానికి పరిమితం కాలేదన్నారు. ఆయన బాటలో తాను అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటానని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచి రంగం సిద్దం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. తాను వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పేశారు.

ALSO READ: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 

ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన వంగవీటి రాధ.. తన తండ్రి విగ్రహావిష్కరణకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజాలకు మద్దతు ఇవ్వాలని, మీ ఆశీర్వాదమే వారికి బలమంటూ ప్రజలను కోరారు. ఈ వ్యవహారంపై రాజకీయాల్లో ఆ కమ్యూనిటీ నేతల మధ్య చిన్నపాటి చర్చ జరిగింది.

కూటమికి అండగా ఉన్న రాధ, వైసీపీ నేతలకు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇవ్వడం వెనుక ఏమైనా ఉద్దేశ్యం ఉందా అంటూ చర్చించుకోవడం మొదలైంది. రంగాకు ఆ రెండు ఫ్యామిలీలు మద్దతుగా ఉండడంతో రాధ ఆ మాట అన్నారా? కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో ఆ ఉద్దేశంతో మద్దతు ఇవ్వాలని కోరారా? మొత్తానికి ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు రాధ, ఆశాలత అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×