E-Paper
Advertisement

Boy Dead : బాలుడి ప్రాణం తీసిన చాక్లెట్‌.. గొంతులో ఇరుక్కోవడంతో ఆగిన ఊపిరి..

Boy Dead : బాలుడి ప్రాణం తీసిన చాక్లెట్‌.. గొంతులో ఇరుక్కోవడంతో ఆగిన ఊపిరి..
Advertisement

Boy Dead : ఆ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసం వారు ఎంతో ఇష్టపడే చాక్లెట్లు తెచ్చారు. కానీ ఆ చాక్లెట్‌ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ లో జరిగింది.

రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకుతెరువు కోసం వరంగల్‌ వచ్చారు. నగరంలోని డాల్ఫిన్‌ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. స్థానిక శారద పబ్లిక్‌ స్కూల్‌లో ముగ్గురు చిన్నారులు చదువుతున్నారు. ఇటీవల కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయంలో విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు.

Advertisement

రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది తండ్రికి సమాచారం అందించి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గొంతులో చాక్లెట్‌ను వైద్యులు గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×