E-Paper
Advertisement

Nissan Gravite MPV: నిస్సాన్ గ్రావైట్ డెలివరీలు షురూ, త్వరలో CNG వెర్షన్ లో కూడా!

Nissan Gravite MPV: నిస్సాన్ గ్రావైట్ డెలివరీలు షురూ, త్వరలో CNG వెర్షన్ లో కూడా!
Advertisement

Nissan Gravite Deliveries: నిస్సాన్ ఇండియా గత నెలలో గ్రావైట్ సబ్ ఫోర్ మీటర్ MPVని మార్కెట్ కు పరిచయం చేసింది. దీని ధరలు రూ. 5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అయ్యింది. రెనాల్ట్ ట్రైబర్ కు ప్రత్యర్థిగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఈ మోడల్ డెలివరీలు పాన్ ఇండియా స్థాయిలో ప్రారంభమయ్యాయని కంపెనీ వెల్లడించింది. ట్రైబర్‌ తో అండర్‌ పిన్నింగ్స్ ను పంచుకునే నిస్సాన్ గ్రావైట్, ఐదు స్పీడ్ మాన్యువల్, AMT యూనిట్లతో జత చేయబడిన 1.0-లీటర్, మూడు సిలిండర్, NA పెట్రోల్ ఇంజిన్‌ తో శక్తినిస్తుంది. ఈ కారు 71bhp పవర్, 96Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 19.6 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. కొత్త గ్రావైట్ MPV ఐదు వేరియంట్లలో, ఐదు రంగులలో అందుబాటులో ఉంది.

నిస్సాన్ గ్రావైట్ MPV డిజైన్

నిస్సాన్ గ్రావైట్ MPV ముందు భాగంలో, గ్రావైట్ మధ్యలో నిస్సాన్ లోగో ఉంది. ఇందులోని చంకీ, బ్లాక్ అవుట్ గ్రిల్‌, బానెట్‌పై గ్రావైట్ లెటరింగ్‌ను కలిగి ఉంది. బానెట్ కు కనెక్ట్ చేయబడిన DRL సిగ్నేచర్, బోనెట్ అంతా విస్తరించిన లైట్ బార్‌ను కూడా  ఉంటుంది. నిస్సాన్ గ్రావైట్ కారు ముందు బంపర్ వైపు చంకీ ఎయిర్ వెంట్స్‌ ను కలిగి ఉంది. ఈ కారు వెనుక భాగం ట్రైబర్‌ని పోలి ఉంటుంది. అయితే, ఇందులో వేరే టెయిల్‌ లైట్ యూనిట్, క్రోమ్ అప్లిక్‌తో చెక్కబడిన టెయిల్‌ గేట్, బంపర్‌పై బ్లాక్-అవుట్ గార్నిష్ ఉన్నాయి.

నిస్సాన్ గ్రావైట్ MPV ఫీచర్లు

Advertisement

నిస్సాన్ గ్రావైట్ MPV రెనాల్ట్ ట్రైబర్ మాదిరిగానే డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ట్రైబర్ నుంచి వేరుగా ఉంచడానికి నిస్సాన్ ఇంటీరియర్‌ ను వేరే కలర్ తో రెడీ చేసింది. ఫీచర్ల పరంగా, రాబోయే నిస్సాన్ MPV 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక AC వెంట్స్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్ తో పాటు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.  దేశీ మార్కెట్ లో విడుదల కాబోయే నిస్సాన్ MPVలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా ఉంటుంది.

నిస్సాన్ గ్రావైట్ MPV ఇంజిన్ స్పెసిఫికేషన్లు   

నిస్సాన్ గ్రావైట్ MPV డిజైన్, ఇంటీరియర్ లే అవుట్ మాదిరిగానే, రెనాల్ట్ ట్రైబర్ మాదిరిగా 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదంటే 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 71 bhp పవర్,96 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ధర గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. లాంచర్ రోజు పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ కారు CNG వెర్షన్ లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Read Also:  నిస్సాన్ గ్రావైట్ To మారుతి సుజుకి ఎర్టిగా.. ఇండియాలోచౌకైన MPVలు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×