BigTV English

TSPSC: టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు..

TSPSC: టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు..

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో ఎగ్జామ్స్‌ను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఏఈ, టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను రద్దు చేయగా.. ఇప్పుడు ఈ పరీక్షలను కూడా రద్దు చేసింది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


తిరిగి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను గతేడాది అక్టోబ‌ర్ 16న, ఏఈఈ ప‌రీక్ష‌ను ఈ ఏడాది జ‌న‌వ‌రి 22న‌, డీఏవో పరీక్షను ఫిబ్ర‌వ‌రి 26న నిర్వ‌హించారు. ఇక పరీక్షలు రద్దు కావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆరా తీస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రవీణ్ సెల్ ఫోన్, అతని పర్సనల్ పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. పెన్‌డ్రైవ్‌లో మరికొన్ని ప్రశ్నాపత్రాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉండడంతో దీనిపై అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు.


Naga Chaitanya: లగ్జరీ ఇంటిని నిర్మించుకున్న నాగచైతన్య.. పదిరోజులుగా ఆ ఇంట్లోనే..

Cholesterol : కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ఆహార పదార్థం..

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×