Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య.. ఏమాయ చేసావే, మజిలీ, లవ్‌స్టోరీ వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సమంతతో విడిపోయాక కొన్నిరోజులు బ్రేక్ తీసుకున్న చై ఆ తర్వాత వరుస సినిమాలకు ఓకే చెబుతున్నాడు.
సమంతతో కలిసి ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చిన చైతన్య .. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు హోటల్‌లోనే ఉన్నాడట. ఇటీవల హైదరాబాద్‌లో ఓ లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడట. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఈ ఇంటిని కట్టించుకున్నాడట. తనకు నచ్చిన విధంగా స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్నాడట. మినీ థియేటర్, జిమ్, స్విమ్మింగ్‌పూల్‌తో పాటు మరెన్నో సౌకర్యాలతో అత్యంత విలాసవంతంగా ఇంటిని నిర్మించుకున్నాడట.
ఇటీవలే ఇంటి నిర్మాణం కూడా పూర్తి కావడంతో గృహప్రవేశం కూడా చేశారట. పది రోజుల నుంచి కొత్త ఇంట్లోనే చై ఉంటున్నాడట. ప్రస్తుతం నాగచైతన్య కొత్త ఇంటి వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.