John Abraham: యాక్షన్ హీరో జాన్ అబ్రహం మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.అయితే ఈ సారి సినిమాలతో కాదు క్రేజీ డీల్ తో.అవును..నిత్యం సినిమాలతోనే బిజీ బిజీగా గడిపే ఈ స్టార్ హీరో తాజాగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా బాంద్రా వెస్ట్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సెయింట్ మార్టిన్ రోడ్‌లో ఉన్న ఒక లగ్జరీ బంగ్లాని కొనేశాడట ఈ కండల వీరుడు.
ఇక ఇదే విషయాన్నీ వెల్లడించిన రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ‘లయాసెస్ ఫోరాస్’ ఈ లగ్జరీ బంగ్లా విలువ ఏకంగా రూ. 84 కోట్లు అని చెప్పడంతో ముక్కున వేలేసుకుంటున్నారంతా.ఇక జులై 14, 2026న అధికారికంగా రిజిస్టర్ అయిన ఈ డీల్ కోసం ఏకంగా రూ. 5.04 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించాడట జాన్.
ఎలా ఉందంటే
ఇక నౌషిర్ ఎరుచ్ దివిత్రే, ఫ్రీడన్ ఎరుచ్ దివిత్రే, క్రిస్టల్ ఫిరోజ్ దివిత్రే, ఎరుచ్ ఫిరోజ్ దివిత్రే అనే యజమానుల నుంచి రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్ ద్వారా దీన్ని కొన్నాడట.ఇక ఈ ప్రాపర్టీ కొలతల విషయానికి వస్తే, ఏకంగా 1,017.60 చదరపు మీటర్ల భారీ ప్లాట్ విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఇది విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రధాన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక అవుట్‌హౌస్ కూడా ఉందట.
2023లోనే 70.83 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా
బాంద్రా లాంటి విఐపి ఏరియాలో ఇంతటి ఓపెన్ స్పేస్ ఉన్న ల్యాండ్‌ను దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే, జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్‌లో ఇలాంటి మైండ్ బ్లాకింగ్ డీల్స్ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో డిసెంబర్ 2023లోనే ముంబై ఖార్ ప్రాంతంలోని లింకింగ్ రోడ్డులో రూ. 70.83 కోట్ల విలువైన మరో లగ్జరీ బంగ్లాను దక్కించుకొని సంచలనం స్ప్రుష్టించిన సంగతి తెల్సిందే. ఇప్పుడు తాజాగా రూ. 84 కోట్లతో బాంద్రా బంగ్లా కూడా ఆయన ఖాతాలో చేరడంతో బాలీవుడ్‌లోనే అత్యంత విలాసవంతమైన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు జాన్ అబ్రహం.
also read :‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!
సినిమాల విషయానికి వస్తే
ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్ అబ్రహం బాలీవుడ్‌లో తనదైన యాక్షన్ మార్క్‌తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. 2023 జనవరి 25న విడుదలైన ‘పఠాన్’ సినిమాలో విలన్ కబీర్ పాత్రలో షారుఖ్ ఖాన్‌కి దీటుగా విలజిజం పండించిన జాన్ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ తర్వాత 2024 ఆగస్టు 15న వచ్చిన ‘వేదా’ చిత్రంలో పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌తో అలరించిన జాన్ ప్రస్తుతం ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా సంచలనాత్మక జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ బైయోపిక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.మొత్తానికి ఒకవైపు మూవీస్ తో మరో వైపు క్రేజీ డీల్స్ తో మీడియాలో హైలెట్ అవుతున్నాడన్న మాట !