E-Paper
Advertisement

Vivek : తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన వివేక్..

Vivek : తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన వివేక్..
Advertisement

Vivek : తెలంగాణ బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ కాషాయ జెండా పక్కనపెట్టి.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మొన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరగా.. ఇప్పుడు జి.వివేక్ వెంకటస్వామి కూడా ఆయన బాటలోనే పయనించారు.

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రిజైనింగ్ లెటర్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపించారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన వివేక్ వెంటనే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆయన నోవాటెల్‌లో రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Advertisement

మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌లోకి వివేకా చేరిక మరింత బలాన్ని ఇస్తోందన్నారు.9 ఏళ్లపాలనలో కేసీఆర్ పాలనలో తన కుటుంబానికి తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు వెంకటస్వామి. కాంగ్రెస్‌లో చేరిన జి.వివేక్.. తన కుమారుడు వంశీకి చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు.

మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇప్పుడు జి.వివేక్ వెంకటస్వామి.. నెక్స్ట్‌ ఎవరు? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. ఓ వర్గం నాయకులు బీజేపీ అధినాయకత్వం వైఖరిపై అసహనంతో ఉన్నారు. తమకు ప్రయారిటీ లేదన్నది ఒక వాదన కాగా.. బీఆర్ఎస్‌తో మిలాఖత్ అయ్యారనే అభిప్రాయం కూడా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత దొరికిపోయినా చూసీ చూడకుండా వ్యవహరించి ప్రజల్లో పార్టీని చులకన అయ్యేలా చేశారని అంటున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×