BigTV English

Weather Alert: ఎల్లో, ఆరేంజ్, రెడ్ అలర్ట్‌లు.. ఎప్పుడిస్తారు? ఎందుకిస్తారు?

Weather Alert: ఎల్లో, ఆరేంజ్, రెడ్ అలర్ట్‌లు.. ఎప్పుడిస్తారు? ఎందుకిస్తారు?
Weather Alerts in Telugu

Weather Alerts in Telugu(Telugu news updates): తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 13 జిల్లాల్లో కుంభవృష్టి ఖాయమని హెచ్చరించింది.


బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. సియర్‌ సూన్‌, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపు వచ్చాయని చెబుతున్నారు అధికారులు. తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌, మరో 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. మెదక్‌, సిద్దిపేట్‌, జనగాం, వరంగల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది.

ఎల్లో అలర్ట్ అంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ హెచ్చరిక జారీ చేస్తారు. డేంజర్ రాబోతోందని సూచనగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే ఈ ఎల్లో అలెర్ట్‌ ఉద్దేశం అప్రమత్తంగా ఉండాలని చెప్పడం. 7.5 మిల్లీమీటర్ల నుంచి 15 మిల్లిమీటర్ల మధ్య వర్షపాతం నమోదై.. సుమారు గంట నుంచి రెండు గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఈ ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.


ఆరెంజ్ అలర్ట్.. ఎల్లో అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్‌గా మారుతుంది. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.

రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణం డేంజర్ లెవల్స్ దాటినప్పుడు.. ఎక్కువ నష్టం జరుగుతుందని భావిస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×