BigTV English

BJP : రాజాసింగ్‌ ఎపిసోడ్‌తో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

BJP : రాజాసింగ్‌ ఎపిసోడ్‌తో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

BJP : ఇలాంటోడు మాకొద్దు. పోతే పో. మేం ఆపేదేలే. ఎన్నిసార్లని ఓపికపడతాం? ఎన్నని భరిస్తాం? ప్రతీసారీ ఏదో ఒక లొల్లి. పార్టీ పెద్దలపై తరుచూ విమర్శలు. ఈసారి ఏకంగా రాజీనామా. రాజాసింగ్ కాంట్రవర్సీని బీజేపీ ముగించేసింది. ఆయన రాజీనామాను ఆమోదించేసింది.


రాంచందర్‌రావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే రాజీనామాను ఆమోదించారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాజీనామా లేఖలో రాజాసింగ్ ప్రస్తావించిన అంశాలు వాస్తవం కాదంటూ బీజేపీ ప్రకటించింది. బీజేపీ సిద్ధాంతాలు, పార్టీ పనితీరుకు వ్యతిరేకంగా రాజాసింగ్‌ వ్యాఖ్యలున్నాయని తెలిపింది.

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?


వాట్ నెక్స్ట్? రాజాసింగ్ లేకపోవడం బీజేపీకి బిగ్ మైనసా? బీజేపీతో లేకపోవడం రాజాసింగ్‌కే బిగ్ లాసా? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ నడుస్తోంది. రాజాసింగ్ పేరుకు గోషామహల్ ఎమ్మెల్యేనే అయినా.. ఆయనంటో తెలీని వాళ్లు రెండు తెలుగు స్టేట్స్‌లో ఎవరూ ఉండరు. అంతెందుకు నేషనల్ వైడ్ పాపులారిటీ అతడి సొంతం. ఫైర్ బ్రాండ్ లీడర్ కావడం.. ఓవైసీ బ్రదర్స్, మజ్లిస్ పార్టీపై విరుచుకుపడటం.. హార్డ్ కోర్ హిందుత్వవాదం వినిపించడం.. పక్కా మాస్ లీడర్ ఇమేజ్.. ఇవన్నీ రాజాసింగ్‌ను బీజేపీ కింగ్‌గా చేశాయి. సోషల్ మీడియాలో ఆయన స్పీచ్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి రాజాసింగ్ తెలంగాణ బీజేపీలో మాత్రం పక్కలో బల్లెంలా మారారనే విమర్శ ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అస్సలు పడదు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉండటం వల్లనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేదని ఓపెన్‌గానే విమర్శిస్తుంటారు. ఆ వివాదమే ఇప్పుడు ఆయన రాజీనామా, ఆమోదం వరకూ దారి తీసింది. బీజేపీలో రాజాసిండ్ శకం ముగిసింది. నెక్ట్స్ ఏంటి?

సింగ్ ఈజ్ కింగ్.. అయితే…!

రాజాసింగే మరీ ఓవర్ చేశారా? తప్పంతా బీజేపీదేనా? ఎవరు కరెక్ట్? అంటే డివైడ్ టాక్ వినిపిస్తోంది. రాజాసింగ్‌కు సొంతంగా ఎంత బలం ఉన్నా అది ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం. బీజేపీ జెండా కింద రాజకీయం చేయడమే అతడిని దేశ్ కి నేతగా పాపులారిటీ తీసుకొచ్చింది. బీజేపీ నీడ లేకుంటే ఇంతలా ఎదిగేవారు కాకపోవచ్చు. గతంలోనూ ఇలానే కాషాయ దళంతో గొడవ పెట్టుకుని.. శివసేనలో చేరారు. ఆ పార్టీకి తెలంగాణలో బలం లేకపోవడంతో.. మళ్లీ బీజేపీ శరణుజొచ్చారు. పార్టీ సైతం ఆయన్ను బాగానే చూసుకుంది. చాలా ఎంకరేజ్ కూడా చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్. సొంతపార్టీ నేతలను బహిరంగంగా కుళ్లబొడుస్తున్నా ఎప్పుడూ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వేరే నేత అలా మాట్లాడి ఉంటే ఎప్పుడో వేటు వేసేది. మజ్లిస్‌కు సరైన మొనగాడు రాజాసింగే. అందుకే అంతలా ఓపిక పట్టింది పార్టీ. బీజేపీ సహనాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న సింగ్.. తానే కింగ్ అనుకున్నారు. అది మరీ ఓవర్‌గా మారడం.. ఆయనే రాజీనామా చేయడంతో.. ఇక చేసేది లేక, ఇంకా ఉపేక్షించలేక.. ఈసారి వేటు వేసేసింది అధిష్టానం. ఇలా బీజేపీలో రాజాసింగ్ ఎపిసోడ్ తాత్కాలికంగా ముగిసింది.

Also Read : రాముడు, శివుడు మావాళ్లే.. నేపాలీల కిరికిరి..

సింగ్‌కు సపోర్ట్ ఎవరు?

బీజేపీ బలం లేకుండా ఓల్డ్‌సిటీలో రాజాసింగ్ ఎలా నెగ్గుకొస్తారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మజ్లిస్ దాడులను సింగిల్‌గా ఫేస్ చేయగలరా? కాషాయ అండాదండా లేకుండా అక్కడ రాజకీయం చేయడం అంత ఈజీనా? ఆయన గతంలో మాదిరే శివసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచీ సిగ్నల్స్ వస్తున్నాయి. ఏ పార్టీలో చేరినా రాజాసింగ్‌ను భరించాల్సిందే. బీజేపీతో తెగే దాకా లాగి తప్పుచేశారని ఆయన అభిమానులే అంటున్నారు.

పాతబస్తీలో కొత్త లీడర్?

ఇక బీజేపీకి పోయేదేమీ లేదు. రాజాసింగ్ ఇంపాక్ట్ కేవలం పాతబస్తీ వరకే. ఓవైసీలపై పోరుకు కొత్త నేతను ఎంచుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు కమలదళానికి. క్రమశిక్షణ, పార్టీ లైన్ దాటితే ఎంతటి బలమైన నేతకైనా వేటు తప్పదనే మెసేజ్ గట్టిగానే ఇచ్చినట్టైంది బీజేపీ. కమలం పార్టీ మర్రివృక్షంలాంటిది. రాజాసింగ్ లాంటి నేతలు వెళ్లిపోయినా.. పెద్దగా పోయేదేమీ ఉండకపోవచ్చు అంటున్నారు.

మరోవైపు, రాజాసింగ్‌ రాజీనామా ఆమోదంతో ఆయన శాసనసభ సభ్యత్వంపై ఉత్కంఠ పెరిగింది. రాజాసింగ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతారా? లేదంటే, పదవికీ రాజీనామా చేస్తారా? పార్టీకి రాజీనామాకు చేశారు కాబట్టి.. అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను బీజేపీ కోరుతుందా? అనేదానిపై త్వరలో క్లారిటీ రావొచ్చు. బీజేపీ జెండా లేకుండా రాజాసింగ్ రాజకీయం ఇకపై ఎలా ఉండబోతుందో చూడాలి…

Related News

Ganesh Festivals: గణేశోత్సవంలో షాకింగ్ ఘటన.. లడ్డూ కేవలం రూ. 99! ఎక్కడో తెలుసా?

CM Revanth Reddy: హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Ganesh laddu: గణేశ్ లడ్డూ వేలంలో ముస్లిం మహిళ.. ఇదే ఇండియా అంటూ కామెంట్స్!

BRS Politics: స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. కేటీఆర్ జిల్లాల పర్యటన, డేట్ కూడా ఫిక్స్?

Hyderabad Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పోలీసు వాహనాన్ని ఢీకొన్న మరో కారు

Warangal Rains: వరంగల్‌లో కుమ్మేస్తున్న భారీ వర్షం.. నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు

Big Stories

×