Hyderabad Accident: హైదరాబాద్ సిటీలో ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్పాట్‌లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు మద్యం మత్తులో యువకులు కారుని డ్రైవ్ చేయడమే కారణంగా తెలుస్తోంది. దీనిపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. అసలేం జరిగింది?
హైదరాబాద్ సిటీలోని లంగర్‌హౌస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. నాలుగున్నర గంటల సమయంలో ఓ కారు.. పోలీసు వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. లంగర్‌హౌస్ రూట్లో గణేష్ నిమజ్జనానికి భారీగా వాహనాలు తరలి వస్తున్నాయి. ఆ ప్రాంత పరిధిలోని చుట్టు పక్కలవారు గణేష్ విగ్రహాలు అర్థరాత్రి సమయంలో బయలు దేరాయి.
ఆ ప్రాంతంలో ఫుల్‌గా ట్రాఫిక్ నెలకొంది. అదే సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
కారులోపల మద్యం సీసాలు ఉన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న 20 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పోలీసు వాహనంలోని ముగ్గురు పోలీసులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి.
ALSO READ: వరంగల్‌లో కుమ్మేసిన భారీ వర్షం.. నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు
పోలీసు వాహనం.. కోళ్లను తరలించే డీసీఎం ట్రక్‌ను ఢీకొంది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన యువతి, గాయపడిన యువతీ యువకులు ఎక్కడివారు? ఎక్కడి వెళ్తున్నారు? కారు నెంబర్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతి చెందిన యువతి పేరెంట్స్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు
తెల్లవారుజామున 4:20 గంటలకు లంగర్ హౌస్ దర్గా సమీపంలో ఘటన
కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు
ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి మృతి, ముగ్గురు పోలీసులకు గాయాలు, మరో ఇద్దరి పరిస్థితి విషమం
మద్యం మత్తులో… pic.twitter.com/y5jLavg61O
— BIG TV Breaking News (@bigtvtelugu) September 7, 2025