Maharashtra Accident: ఈ రోజుల్లో యువతలో సోషల్ మీడియా క్రేజ్ అపారంగా పెరిగిపోయింది. తక్కువ టైమ్‌లో పాపులర్ అవ్వాలని.. వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఎక్కడికీ దారి తీస్తాయో చాలామందికి అర్థం కావడం లేదు. చిన్న చిన్న రీల్స్, స్టంట్లు చేయడం కోసం వాళ్లు తీసుకుంటున్న రిస్కులు అంతా ఇంతా కాదు. వీటిలో కొన్నింటి ఫలితాలు మాత్రం ఊహించని విధంగా విషాదాంతం అవుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పఠాన్, సదావాఘాపుర్ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. పర్యాటకులు విహారయాత్రలకు తరలివచ్చే ప్రదేశం ఇది. ఇక్కడి అందాలను చూపిస్తూ వీడియోలు తీస్తే.. వైరల్ అవుతాయని అనుకున్న సాహిల్ జాదవ్ అనే యువకుడు, తన కారుతో హిల్‌స్టేషన్ పైన స్టంట్స్ చేయడం మొదలుపెట్టాడు. రీల్ కోసం చేయబోయిన ప్రయత్నం అతడి జీవితాన్ని ఊహించని విధంగా మలుపు తిప్పింది.
సాహిల్, తన కారుతో ఎత్తైన కొండ పైన ఉండే రహదారిలో డ్రిఫ్ట్ స్టంట్ చేయబోయాడు. కొండ ప్రక్కనే గ్యాప్ ఉన్నదని తెలిసినా.. అందాన్ని, రిస్క్‌ని చూపించే ఉద్దేశంతో అతడు ఆ యాక్షన్‌కి దిగాడు. కానీ కారు అదుపు తప్పింది. చూస్తుండగానే కారు 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే స్పందించి, సహాయక బృందాలకు సమాచారం అందించారు.
రెస్క్యూ టీం తీవ్ర శ్రమతో లోయలోకి దిగిన తర్వాత.. సాహిల్‌ను కారులో నుంచి బయటకు తీసుకువచ్చారు. అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. తలకు గాయాలు, ఎముకలు విరిగిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాహిల్.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ యువతా మేలుకో.. రీల్స్ పిచ్చి మానుకో.. అని ఎంతచెప్పినా మారడం లేదు. వైరల్ అయ్యేందుకు చేస్తున్న విన్యాసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ మోజులో ఇంతటి తిప్పలు అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా రీల్స్, స్టంట్స్ కోసమే జీవితం కాదు. మన ప్రాణం కంటే ఏ రీల్, ఏ లైక్, ఏ ఫాలోవర్ విలువైనది కాదు. ఒక వీడియోతో సెలబ్రిటీ అవ్వాలని తపన వద్దు. ప్రాణం కోల్పోతే, కుటుంబానికి అపార నష్టమే మిగులుతుంది.
Also Read: గర్భంలో బిడ్డ ఇలా ఏర్పడుతుందా? కట్టిపడేస్తున్న అద్భుత శిల్పాలు.. ఎక్కడో తెలుసా?
ఈ ఘటనకు సంభందించి పోలీసులు విచారణ ప్రారంభించారు. హిల్‌స్టేషన్ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయకుండా.. మున్ముందు కఠిన నిబంధనలు విధించనున్నారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌పై బాధ్యతా భావం కలిగించాలని, ప్రమాదకర వీడియోల్ని ప్రోత్సహించవద్దని అధికారులు సూచిస్తున్నారు.
#WATCH | Maharashtra: Car Plunges Into Valley While Driver Clicks Scenic Photos In Satara
Read: https://t.co/MYAXaI4Kbu#Maharashtra #satara pic.twitter.com/pHuYxdPjSs
— Free Press Journal (@fpjindia) July 10, 2025