BigTV English

Bigg Boss 9 Prize Money: ఆహా.. ఈ సారి అదిరిపోయే ప్రైజ్ మనీ.. అందుకే గోప్యంగా ఉంచారా? విన్నర్‌కు పండగే!

Bigg Boss 9 Prize Money: ఆహా.. ఈ సారి అదిరిపోయే ప్రైజ్ మనీ.. అందుకే గోప్యంగా ఉంచారా? విన్నర్‌కు పండగే!

Bigg Boss 9 telugu Prize Money: ‘బిగ్ బాస్’ సీజన్ మొదలైందంటే.. అందరి చూపు వారి రెమ్యునరేషన్ మీదే ఉంటుంది. ఈసారి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? ఎలాంటి ఆఫర్స్ ఇస్తారనే ఆసక్తి కలుగుతుంది. గత సీజన్‌లో కంటెస్టెంట్లే తమ ప్రైజ్ మనీని పెంచుకొనే ఛాన్స్ ఇచ్చారు. మొత్తం బిగ్ బాస్ తెలుగు సీజన్ల కంటే ఎక్కువ పారితోషికాన్ని సీజన్ 8 విన్నర్ నిఖిల్ తన ఇంటికి తీసుకెళ్లాడు. రూ.55 లక్షలను గెలుచుకున్నాడు. దానితోపాటు మారుతి సుజుకి డిజైర్ కారును కూడా అందుకున్నాడు. అయితే, ఈసారి విన్నర్‌కు అంతకంటే ఎక్కువ ప్రైజ్ మనీ లభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సారి భారీ ఆఫర్ ఇవ్వడం ద్వారా కంటెస్టెంట్లలో కసిని పెంచాలని, అప్పుడే అసలైన కంటెంట్ బయటకు వస్తుందని ఫిక్స్ అయిపోయారట బీబీ నిర్వాహకులు.


మొదటి నుంచి రూ.50 లక్షలే..

‘బిగ్ బాస్’ సీజన్ 1 నుంచి రూ.50 లక్షలే ప్రైజ్ మనీగా ప్రకటిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆ మొత్తంలో మాత్రం మార్పు రావడంలేదు. ఒక వేళ విజేతలు అంత మొత్తం గెలుచుకున్నా.. ట్యాక్స్ రూపంలో కొంతమొత్తాన్ని కోల్పోతారు. పూర్తిగా రూ.50 లక్షలను ఇంటికి తీసుకెళ్లలేరు. అయితే, కంటెస్టెంట్లు మాత్రం ప్రైజ్ మనీతో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి కారణం.. వారికి ప్రతి వారం వచ్చే పారితోషకమే. ఔనండి. వాళ్లు హౌస్‌లో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకు ప్రత్యేక పారితోషికం లభిస్తుంది. అయితే, అది వారి స్థాయి, పాపులారిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. దానికి రూ.50 లక్షలు కూడా తోడైతే.. ఎక్కువ మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లగలరు.

సీజన్ 8లో మారిన రూల్.. మరి ఇప్పుడు?

‘బిగ్ బాస్’ సీజన్ 8లో మాత్రం రూల్ మారింది. కంటెస్టెంట్లు టాస్కుల ద్వారా ప్రైజ్ మనీని సంపాదించుకున్నారు. అయితే, అది కూడా రూ.55 లక్షలకే చేరింది. మరి, మరింత బాగా టాస్కులు పూర్తి చేసి ఉంటే.. ఆ మొత్తం ఎంతకు చేరేదో. కోట్లాది ప్రేక్షకులు వీక్షించే హిందీ బిగ్ బాస్‌లో కూడా ప్రైజ్ మనీ రూ.50 లక్షలే. కానీ, హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత స్పాన్సర్లు, యాడ్స్ ద్వారా బోలెడంత డబ్బు లభిస్తుంది. అందుకే.. అప్పటి నుంచి ప్రైజ్ మనీలో మార్పు లేదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఈ ఏడాది రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందా? లేదా గత సీజన్ సాంప్రదాయాన్నే కొనసాగిస్తారా అనేది సస్పెన్స్‌గా ఉంచారు. హోస్ట్ నాగార్జున కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.


Also Read: Nagarjuna Remuneration: బిగ్ బాస్ 9తో నాగార్జున సరికొత్త రికార్డు.. ఈ సారి అన్ని కోట్లా? కింగ్ అనిపించుకున్నాడుగా!

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రెండు ఇళ్లకు కలిపి రూ.60 లక్షల ప్రైజ్ మనీ ఫిక్స్ చేసి.. టాస్కుల ద్వారా దాన్ని సాధించుకొనేలా పోటీ పెట్టే అవకాశాలు ఉన్నాయట. అదే జరిగితే కంటెస్టెంట్లకు పండగే. పైగా పాపులారిటీ సంపాదించే కంటెస్టెంట్ల వీక్లీ రెమ్యునరేషన్‌లో కూడా హైక్ ఉంటుందని టాక్. ప్రస్తుతం హౌస్‌లో కామన్ మ్యాన్, ఉమెన్ కూడా ఉన్నారు. వీరిలో ఎవరికి క్రేజ్ లభించినా.. లక్షలు అందుకొనే ఛాన్స్ ఉంది. సోమవారం మొదటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

Related News

Nagarjuna Remuneration: బిగ్ బాస్ 9తో నాగార్జున సరికొత్త రికార్డు.. ఈ సారి అన్ని కోట్లా? కింగ్ అనిపించుకున్నాడుగా!

Commoners vs Celebrities : రెండు ఇళ్ల పంపకం… ఎవరికి ఏ ఇళ్లు ఇచ్చారంటే?

Bigg Boss 9 Telugu : హౌస్ లోకి ఫోక్ సింగర్.. అప్పుడు మిస్ వరల్డ్.. ఇప్పుడు బిగ్ బాస్..

Bigg Boss Telugu season 9: ఆ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ అక్క… 10వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి

Bigg boss 9 Telugu: 9వ కంటెస్టెంట్ గా మూడవ కామనర్.. పుషప్స్ తో పిచ్చెక్కిస్తూ!

Big Stories

×