Ganesh Festivals: హైదరాబాద్ కొత్తపేటలో గణేష్ ఉత్సవాలు సందర్భంగా ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా కోట్ల రూపాయలు పలికే గణనాథుని లడూ రూ.100 రూపాయలకంటే అతి తక్కువ ధరకు ఓ విద్యార్థి గెలుచుకున్నాడు. అదికూడా లక్కీ డ్రా సందర్భంగా జరిగిన ఈ సంఘటన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని చెబుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ లోని కొత్తపేటలో చోటుచేసుకుంది. ఈ లడ్డూ ఎన్ని కేజీలు? ఎవరు గెలుచుకున్నారు? అనేది తెలుసుకుందాం.
Also Read: Viral Video: పెళ్లి కూతురును ఎత్తుకొని బొక్కబోర్ల పడ్డ పెళ్లి కొడుకు, నెట్టింట వీడియో వైరల్!
హైదరాబాద్ లోని కొత్తపేటలో శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ గణపతి ఉత్సవాలు నిర్వహించారు. వీరు అందరికీ వినూత్నంగా గణపతి లడ్డూకోసం ఈ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. మొత్తం 760 టోకెన్ల వచ్చాయి. ఇందులో భాగంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా టోకెన్లలో లక్కి డ్రాను నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో సాక్షిత్ గౌడ్ అనే విద్యార్థి పేరు రావడంతో కుటుంబ సభ్యులు అనందంలో మునిగిపోయారు. ఈ లక్కీ డ్రా సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లభించే 333 కేజీల లడ్డూని కేవలం 99 రూపాయలే చెల్లించి విద్యార్థి గెలుచుకున్నాడు.
లడ్డూ 333 కేజీలు అంటే సుమారు 6,66,000 గ్రాములు, అంటే లక్షల మందికి సరిపడే పరిమాణం. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరికి షాక్ కలిగింది. విజేత సాక్షిత్ గౌడ్ “నేను నమ్మలేక పోతున్నానని ఇది నిజంగా నా అదృష్టమని చెప్పారు. కేవలం 99 రూపాయలే చెల్లించి ఈ భారీ లడ్డూని గెలుచుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే అన్నాడు. ఇలాంటి లక్కీ డ్రా యువత, స్థానిక సమాజంలో వినూత్న ఆలోచనలకు ప్రతి ఒక్కరికి స్పూర్తిగా మారింది. ఇలాంటివి చూసి ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
రూ.99కే 333 కిలోల గణేష్ లడ్డూ..
హైదరాబాద్ కొత్తపేటలో లక్కీ డ్రా గెలిచిన విద్యార్థి pic.twitter.com/zg9QIQBjVI
— BIG TV Breaking News (@bigtvtelugu) September 7, 2025