Warangal Rains: తెలంగాణను వర్షాలు వీడడం లేదు. రోజుకు ఏదోవొక ప్రాంతంలో కుమ్మేస్తున్నాయి. వేకువ జామునుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం తడిచి ముద్దయ్యింది. చెరువులను తలపిస్తున్నాయి ప్రధాన రహదారులు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
అండర్ బ్రిడ్జ్ దగ్గర వరద నీటిలో చిక్కుకున్నాయి రెండు ఆర్టీసీ బస్సులు. అన్నారం, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన ఆయా బస్సుల్లో దాాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. తాళ్ల సాయంలో వారిని బయటకు తీసుకొచ్చారు. పరిస్థితి గమనించిన పోలీసులు ఆ మార్గాన్ని మూసివేశారు.
ఎన్టీఆర్ నగర్, సాకరాశి, శివనగర్, సాయిగణేష్ కాలనీతోపాటు తుమ్మలకుంటలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. హనుమకొండ తిరుమల జంక్షన్ వద్ద వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అశోక్ కాలనీలో భారీ వృక్షం విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో, అధికారుల విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడం మొదలైంది. మూడు కాలనీలు నీట మునిగాయి. రెండున్నర దశాబ్దాలుగా తాము ఇదే పరిస్థితి ఎదుర్కొంటు న్నామని, ఈ సమస్యకు ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదని అంటున్నారు.
ALSO READ: హైదరాబాద్ సిటీలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, నేటి సాయంత్రానికి పూర్తి
చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఓ వైపు మాత్రమే డ్రైనేజీ ఉందని, అందులో చెత్త పూడుకుపోయిందని అంటున్నారు. ఉన్న కాలువలు సైతం 80 శాతం చెత్తతో పూడుకుపోయిందని అంటున్నారు. ఉదయం వర్షం పడడంతో వెంటనే అలర్ట్ అయ్యామని, అదే రాత్రివేళ ఈ స్థాయిలో వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ ఆఫీసుకు కేవలం ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉందని అంటున్నారు.
వరంగల్ లో భారీ వర్షం..
తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు
అండర్ బ్రిడ్జ్ దగ్గర వరదల్లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు
నీట మునిగిన పలు కాలనీలు pic.twitter.com/zF8s5HvVdY
— BIG TV Breaking News (@bigtvtelugu) September 7, 2025