BigTV English

క్రెడిట్ కార్డు బిల్స్ ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తున్నారా..దీని వల్ల కలిగే నష్టాలేంటి..? ప్రత్యామ్నాయాలేంటి…?

క్రెడిట్ కార్డు బిల్స్ ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తున్నారా..దీని వల్ల కలిగే నష్టాలేంటి..? ప్రత్యామ్నాయాలేంటి…?

క్రెడిట్ కార్డు బిల్లు తడిసి మోపెడు అవుతోందా..? మీ జీతం మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి సరిపోతుందా… అయితే వెంటనే క్రెడిట్ కార్డు ఆఫర్ చేసిన బ్యాంకు వారు మీ క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేస్తామని ఆఫర్స్ పెడుతుంటారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలామంది తమ క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు ఓకే చెబుతారు. కానీ ఇక్కడే మీరు ఒక చిక్కులో పడుతున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి. నిజానికి క్రెడిట్ కార్డు బిల్లు ఇఎంఐ రూపంలో చెల్లించడం ద్వారా . పెద్ద మొత్తంలో మీరు వడ్డీ రూపంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు ఇఎంఐ ద్వారా చెల్లిస్తే కలిగే నష్టాలతో పాటు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా తెలుసుకుందాం.


ముందుగా క్రెడిట్ కార్డు బిల్లును EMI రూపంలో చెల్లించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

వడ్డీ భారం పెరుగుతుంది: 
క్రెడిట్ కార్డు బిల్లును EMI రూపంలో కన్వర్ట్ చేయడం ద్వారా, ఈఎంఐపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈ వడ్డీ రేట్లు 18% నుంచి 36% వరకు ఉంటాయి. అంటే ఈ వడ్డీ రేటు సాధారణ పర్సనల్ లోన్ లేదా హోం లోన్ వడ్డీ కంటే చాలా ఎక్కువ అన్న సంగతి గుర్తించాలి.


ప్రాసెసింగ్ ఫీజు, హిడెన్ ఛార్జీలు అధికంగా ఉంటాయి:
సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లును ఇఎంఐ రూపంలో మార్చేందుకు బ్యాంకులు ఎక్కువగా ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తుంటాయి. అంతేకాదు ఒకవేళ మీరు ఈఎంఐ ముందుగానే క్లోజ్ చేసినట్లయితే ఫ్రీ క్లోజర్ చార్జీలను కూడా వసూలు చేస్తాయి.

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం:
అలాగే ప్రతిసారి మీకు క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐ రూపంలో మారుస్తున్నట్లు అయితే, అప్పుడు సిబిల్ స్కోర్ సైతం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. దీనిని ఓవర్ డిపెండెన్స్‌ గా భావిస్తారు. ఫలితంగా ఫ్యూచర్‌లో లోన్ తీసుకోవడానికి బ్యాంకులు అనుమాన పడే అవకాశం ఉంటుంది.

అసలు బిల్లు కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది: 
మీరు పదే పదే క్రెడిట్ కార్డు బిల్లును ఇఎంఐ కింద కన్వర్ట్ చేసినట్లయితే, మీరు ప్రతిసారి మీకు వచ్చిన బిల్లు కన్నా ఎక్కువ చెల్లించినట్లు అవుతుంది. ఉదాహరణకు లక్ష రూపాయల క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చినట్లయితే మీరు దానిని ఏమై కింద మార్చినట్లయితే అన్ని ఫీజులు, వడ్డీ రేట్లు కలుపుకొని మీరు చెల్లించాల్సిన మొత్తం రూ. 1.25 – 1.3 లక్షల వరకు చెల్లించాల్సి రావచ్చు.

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి ప్రత్యామ్నాయాలు ఇవే..

పర్సనల్ లోన్ తీసుకోవడం: 
సాధారణంగా బ్యాంకులు పర్సనల్ లోన్స్‌ 10–14% వడ్డీతో ఇస్తాయి.ఈ మొత్తం క్రెడిట్ కార్డు EMI కంటే చాలా తక్కువ.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (BT) ఆఫర్:
ఒక క్రెడిట్ కార్డు నుండి మరో కార్డుకు బకాయిలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.కొన్ని కార్డు కంపెనీలు కొన్ని నెలల పాటు 0% లేదా చాలా తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.

సేవింగ్స్ వాడుకోండి:
మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ వంటివి ఉంటే వాటిని బయటకు తీసి బిల్లులు క్లియర్ చేయడం మంచిది. EMI వడ్డీ కంటే FD మీద వచ్చే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది.

Related News

లోన్ యాప్స్ చట్టబద్ధమేనా..? ఇల్లీగల్ లోన్ యాప్స్ ఎలా గుర్తించాలి..?

Redmi Note 15 Pro Plus: రెడ్‌మి 200 మెగా పిక్సెల్ కెమెరా.. మార్కెట్‌లో సంచలనం

Oppo Offers: ఒప్పో దీపావళి 2025 ఆఫర్లు వచ్చేశాయి.. స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు

Mobile Data: మొబైల్ డేటా ఇట్టే అయిపోతుందా? ఈ టిప్స్ పాటిస్తే ఇక నో టెన్షన్!

Samsung Galaxy: ఏముంది భయ్యా.. సామ్‌సంగ్ గెలాక్సీ A17 5G కొత్త ఫోన్‌

Big Stories

×