YS Sharmila today news(Political news telugu):
ఎన్నికలకు 3 నెలలు ముందు నుంచే ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారిపోయాయి. ఏపీలో వాతావరణం చూస్తే ఎన్నికలు ఇవాళ? రేపా అని అన్నట్టు ఉంది. నిన్న, మొన్నటి వరకూ సైలంట్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి స్పీడ్ పెంచింది. వైఎస్ షర్మిల తన భర్త అనిల్ తో కలిసి నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. ఇవాళ ఉదయం 10గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలవనున్నారు. ఆ తర్వాత ఆమె హస్తం కండువా కప్పుకోనున్నారు. ఆమె స్థాపించిన వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు.
చేరికల కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్‌తో పాటు మరికొంత మంది సీనియర్లు పాల్గొంటారు. ఆ తర్వాత ఏపీలో పార్టీ బలోపేతం, చేరికలపై చర్చిస్తారు. ఇప్పటికే వైసీపీలోని అసంతృప్త నేతలకు షర్మిల, కాంగ్రెస్ ఓ ఆశాదీపంలా కనిపిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల వెంట నడవడానికి సిద్దంగా ఉన్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరింత మంది ఆర్కే బాట పడతారని కాంగ్రెస్ అగ్రనేతలు బావిస్తున్నారు.