BigTV English

CM Revanth Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాలపై చర్చ

CM Revanth Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాలపై చర్చ
Political news in telangana

CM Revanth Delhi Tour(Political news in telangana):


సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఈ మేరకు ఏఐసీసీ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే, సోనియా, రాహుల్‌ గాంధీతోపాటు ఆయా రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్‌లు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయనవుతున్నారు.

మరో రెండు నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున కేంద్రంలో అధికార చక్రం తిప్పేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. మోదీని గద్దె దించడమే టార్గెట్‌గా ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే సమావేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తంతో పాటు భారత్‌ న్యాయ యాత్రపై చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విజయబావుట ఎగురవేసిన హస్తం పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌ అమలు చేస్తున్న గ్యారెంటీ స్కీంలు, నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చించనున్నారు. కాగా.. చర్చల అనంతరం పోస్టుల భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


ఇదిలా ఉంటే.. రేవంత్‌ ఢిల్లీ టూర్‌పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవాళ వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఢిల్లీ వెళ్లడం, ఆమె పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ ఢిల్లీకి వెళ్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న క్యాబినెట్‌ విస్తరణపై హైకమాండ్‌తో చర్చల కోసమే వెళ్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×