E-Paper
Advertisement

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే
Advertisement

Vemulawada Rajanna Temple:  దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్న ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం కొలువుదీరింది. ఈ ఆలయం కూడా శైవ క్షేత్రమే. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయంలో స్వయంభు శివుడు కొలువుదీరాడు. లింగం రూపంలోనే శివుడు దర్శనం ఇస్తాడు. ఉత్తర తెలంగాణ ప్రజలు వేములవాడ రాజన్నను ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. మ‌హారాష్ట్ర, సోలాపూర్‌, ముంబై నుంచి కూడా భ‌క్తులు వ‌స్తారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

వేముల‌వాడ రాజ‌న్న‌కు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ?

Advertisement

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యం గోవులు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి ఆలయంలో గోవులు ఉన్నట్లుగానే రాజన్న ఆలయంలో కూడా మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. వేములవాడ ఆలయంలో ఉన్న గోవులను కోడెలుగా పిలుస్తూ ఉంటారు. తెలంగాణ యాస భాష ప్రకారం కోడెలుగా పిలవడం మొదటి నుంచి వచ్చింది. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు కట్టడం వెనుక రహస్యం ఉంది. శివుడికి కోడలు అంటే చాలా ఇష్టం. యవ్వనంలో ఉన్న ఆ కోడెలను స్వామివారికి సమర్పించడమే ఈ మొక్కు ఉద్దేశం.

స్థల పురాణం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి ఆ ఇద్దరు పూజలు చేశారు. ఈ క్రమంలో వేములవాడ రాజన్న అనుగ్రహంతో సాంబుడు అనే పుత్రుడు… శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు జన్మించాడు. అయితే తమ కోరిక తీర్చినందుకుగాను ధర్మదేవ అనే కోడెను మొక్కుబడిగా శ్రీకృష్ణుడు సమర్పించాడు. దీంతో అప్పటి నుంచి, కోరికలు తీరిన తర్వాత కోడెలు కట్టేయడం ఆనవాయితీగా వచ్చింది.

ఎవరెవరు కోడెలు కడతారు ?

Advertisement

సంతానం కోసం వేములవాడ రాజన్నను చాలామంది భక్తులు సందర్శిస్తుంటారు. రాజన్న సన్నిధికి వచ్చిన దంపతులకు కచ్చితంగా పిల్లలు పుడతారని వారి నమ్మకం గట్టిగానే ఉంది. అయితే సంతానం కలిగితే, కోడెలు కట్టేసి తమ ముక్కు తీర్చుకుంటారు. అనారోగ్యంగా ఉన్నవాళ్లు, సిరిసంపదల కోసం, జీవితంలో సక్సెస్ కావడం కోసం ఈ మొక్కలు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు.

కోడెను కట్టు విధానం

వేములవాడ రాజన్న ఆలయంలో శివుని ఆలయం చుట్టూ ఆ కోడెలు పట్టుకొని భక్తులు తిరగాలి. మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత గజ స్తంభానికి ఆ కోడెను కట్టేయాలి. అప్పుడే మొక్కు చెల్లించినట్లు అవుతుంది. ఇది అక్కడి భక్తుల నమ్మకం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… వేములవాడ ఆలయం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాత ఆలయాన్ని, పూర్తిగా మార్చేసి… కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం కోట్లల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మరో ఏడాదిలోపు వేములవాడ రాజన్న కొత్త ఆలయం పూర్తి కానుంది. ఇక్కడే బద్ది పోచమ్మ ఆలయం కూడా చాలా ఫేమస్. ఆమెకు కూడా పెద్ద దేవాలయాన్ని కట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !


Related News

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

Big Stories

Advertisement
×