E-Paper
Advertisement

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!
Advertisement

Jagannath Rath Yatra 2026 in Pakistan: పాకిస్తాన్‌ ఈ ఏడాది కూడా అట్టహాసంగా జగన్నాథుడి రథయాత్ర వేడుక జరిగింది. కరాచీలో నివసిస్తున్న హిందూ సమాజం జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించింది. జూలై 16న జరిగిన ఈ వేడుకలో వందలాది మంది భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవం కరాచీలోని హిందూ సమాజానికి ఎంతో ప్రత్యేకమైనది.

శ్రీస్వామినారాయణ మందిరం నుంచి యాత్ర ప్రారంభం

రథయాత్ర కరాచీలోని ఎం.ఏ. జిన్నా రోడ్డులో ఉన్న చారిత్రాత్మక శ్రీ స్వామినారాయణ మందిరం నుంచి ఈ రథయాత్ర వేడుక ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో అలంకరించిన జగన్నాథుడి రథాన్ని ఊరేగింపుగా నగర వీధుల గుండా తీసుకెళ్లారు. రథయాత్ర సందర్భంగా భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ భక్తిరసాన్ని పంచారు. చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు  ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన భక్తులు రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. రంగురంగుల అలంకరణలతో రథయాత్ర మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

పూరీ సంప్రదాయాన్ని గుర్తు చేసిన వేడుక

Advertisement

ఈ రథయాత్ర ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే ప్రసిద్ధ రథయాత్రను గుర్తు చేసేలా నిర్వహించారు. భారీ పందిరితో అలంకరించిన రథంలో జగన్నాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిజానికి కరాచీలో జరుగుతున్న ఈ రథయాత్రకు సుదీర్ఘ చరిత్ర ఉంది. స్థానిక హిందూ సమాజం గత నాలుగు దశాబ్దాలుగా ఈ ఉత్సవాన్ని నిరంతరంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన వేడుక 43వ వార్షిక రథయాత్రగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సంప్రదాయాన్ని కొనసాగించడం స్థానిక హిందూ సమాజం విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్

ఈ రథయాత్రకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. పాకిస్తాన్‌లో హిందూ సమాజం తమ మతపరమైన సంప్రదాయాలను ప్రశాంతంగా కొనసాగిస్తుండడం చాలా మందిని ఆకట్టుకుంది. భారత్ తో పాటు ఇతర దేశాల్లోని నెటిజన్లు కూడా ఈ వేడుకలపై ఆసక్తి చూపించారు. అద్భుతం అంటూ కొనియాడారు.

సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం

Advertisement

కరాచీలో జరిగిన జగన్నాథ రథయాత్ర కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. విదేశీ నేలపై కూడా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్న హిందూ సమాజం ఐక్యతకు ప్రతీక. భక్తి, సామరస్యం, సంప్రదాయం కలిసిన ఈ వేడుక కరాచీ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు.

Read Also: వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×