E-Paper
Advertisement

Viral Video: బుర్ఖా వేసుకుని లేడీస్ కోచ్ లోకి వెళ్లిన వ్యక్తి.. అసలు విషయం తెలియడంతో..

Viral Video: బుర్ఖా వేసుకుని లేడీస్ కోచ్ లోకి వెళ్లిన వ్యక్తి.. అసలు విషయం తెలియడంతో..
Advertisement

Local Train Viral Video: లోకల్ ట్రైన్స్ లో మహిళల భద్రత కోసం ప్రత్యేక కోచ్ లు ఉంటాయి. వాటిలోకి కేవలం మహిళలు ఎక్కాల్సి  ఉంటుంది. ఒకవేళ పొరపాటున పురుషులు వెళ్తే, రైల్వే అధికారులు జరిమానా విధిస్తారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి బుర్ఖా వేసుకుని మహిళగా నటిస్తూ లేడీస్ కోచ్ లోకి ఎక్కాడు. కాసేపయ్యాక మహిళలు అతడిని కనిపెట్టారు. ప్రస్తుతం బుర్ఖా వేసుకున్న మగాడి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

ముంబై సబర్బన్ రైల్వే నెట్‌ వర్క్ లోని రైళ్లు అన్నీ నిత్యం ప్రయాణీకులతో కిక్కిరిసిపోతాయి. లోకల్ ట్రైన్స్ ద్వారా నిత్యం వేలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ స్థానిక రైళ్లలో మహిళల కోసం ప్రత్యేకంగా లేడీస్ కోచ్ లు ఉన్నాయి. మహిళలకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా, వారి భద్రత పెంచేలా ఈ కోచ్ లను ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా ఈ కోచ్ లలోనూ మహిళలకు భద్రత ఉండటం లేదని నిరూపితం అయ్యింది. ఓ వ్యక్తి ఏకంగా బుర్ఖా ధరించి మహిళల కోచ్ లోకి వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు

ఈ వీడియోలో ఓ వ్యక్తి బుర్ఖా ధరించి మహిళా కోచ్ లోకి ఎక్కాడు. వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అయితే, తను మహిళ కాదని కోచ్ లోని ఇతర ప్రయాణీకులకు అనుమానం కలిగింది అసలు విషయం ఆరా తీస్తే నిజంగానే అతడు లేడీ కాదని లేది. వెంటనే సదరు మహిళలు వెంటనే రైల్లో భద్రతా సిబ్బందికి విషయం చెప్పారు. అధికారులు లేడీస్ కోచ్ దగ్గరికి వచ్చే లోగా అతడు రైలు దూకి పారిపోయాడు. అయినప్పటికీ, రైల్వే రక్షణ దళం (RPF) అతడిపై కేసు నమోదు చేసింది.

Advertisement

Read Also: హైస్పీడ్ రైల్ హబ్ గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ల లింక్ ఇక్కడే!

మహిళా ప్రయాణీకుల భద్రతపై ఆందోళన

నిజానికి ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం  జరిగింది. మగాడు మహిళలా బుర్ఖా వేసుకుని రావడంపై తోటి ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది అతడిని వీడియోను రికార్డు చేశారు. అదే సమయంలో సదరు వ్యక్తి రైలు స్లో కాగాన దూకి పారిపోయాడు. ప్రస్తుతం అతడి కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో రైళ్లలో మహిళల భద్రత విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా మహిళా కోచ్ లకు ప్రత్యేక భద్రతా సిబ్బందిని నియమించాలని పలువురు లేడీ ప్రయాణీకులు కోరుతున్నారు. లేదంటే, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.

Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రోజుల పాటు ఈ రూట్లలో రైళ్లు క్యాన్సిల్!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×