E-Paper
Advertisement

Harish Rao: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై హరీష్ రావు సెటైర్లు.. ఏమన్నారంటే..!

Harish Rao: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై హరీష్ రావు సెటైర్లు.. ఏమన్నారంటే..!
Advertisement

Harish Rao: స్వేఛ్చ బ్యూరో: ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని బచ్చుగూడెం, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొని ప్రజలను నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్, మాజీ ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ళ శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్‌చెరు మండల ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఈ కార్యక్రమంలో హాజరై కాంగ్రేస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం రెండున్నర యేండ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమేనని విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారెంటీల మాటలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయని, అభివృద్ధి మాట ఎక్కడ కనిపిస్తలేదని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రేస్ పాలనపై ఇప్పటికే విసుగు వచ్చిందని తెలిపారు. చిట్కుల్–బచ్చుగూడెం మార్గంలో బ్రిడ్జి నిర్మాణం, రోడ్డును విశాలంగా అభివృద్ధి చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. రోడ్లు డెవలప్ అవ్వడం వల్ల చుట్టుపక్కల భూములకు ధరలు పెరిగాయని, దాంతో ప్రాంత అభివృద్ధి వేగంగా ముందుకెళ్లిందని చెప్పారు. ఇవన్నీ బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. చిట్కుల్ నుంచి భరిలో ఉన్న కాంగ్రేస్ నాయకులను నిలదీసి ఆరు గ్యారెంటీల ముచ్చట ఏమైందో అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండున్నర యేండ్ల కాంగ్రేస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, మౌలిక వసతులు కూడా సరిగా అందించలేని చేతగాని ప్రభుత్వం ఇదని తీవ్రంగా విమర్శించారు.

Advertisement

Also Read: Mumbai Crime: దొంగగా మారిన బిజినెస్‌మేన్.. చివరకు పోలీసులకు చిక్కాడు? జల్సాల వల్లేనా?

ప్రజల సంక్షేమమే లక్ష్యం

మరుగున పడిన గ్రామాలను, కాలనీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టించాలంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, చిట్కుల్ మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు మేరాజ్ ఖాన్, పృథ్విరాజ్‌తో పాటు గ్రామ యువకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Also Read: Anil Ravipudi: హీరోగా సక్సెస్ డైరెక్టర్.. అనిల్ ఏమన్నారంటే?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×