E-Paper
Advertisement

Trains Cancelled: ప్రయాణీకులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రోజుల పాటు ఈ రూట్లలో రైళ్లు క్యాన్సిల్!

Trains Cancelled: ప్రయాణీకులకు అలర్ట్..   తెలుగు రాష్ట్రాల్లో రోజుల పాటు ఈ రూట్లలో రైళ్లు క్యాన్సిల్!
Advertisement

SCR Cancels 8 Passenger Services: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు అలర్ట్ జారీ చేసింది. తన నెట్ వర్క్ పరిధిలో రెండు రోజుల పాటు 8 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ, రేపు ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఆ మార్గాల్లో వెళ్లే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది.

ఏ మార్గాల్లో రైళ్లు రద్దు అవుతున్నాయంటే?

తాజాగా క్యాన్సిల్ అయ్యే రైళ్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్- విజయవాడ, విజయవాడ-గుంటూరు మధ్య నడిచే రైళ్లు, అలాగే సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ మార్గాల్లో నడిచే 8 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు సాధారణంగా ప్రతిరోజూ నడుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా స్వల్ప దూర, సబర్బన్ ప్రయాణికులకు ఎక్కువగా సేవలు అందిస్తాయి. రెండు రోజుల పాటు వీటి సేవలను నిలిపి వేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.

Advertisement

Read Also:  మిస్టరీ రైల్వే స్టేషన్.. ఆ స్టేషన్ గుండా వెళ్లే రైళ్లలో.. అకస్మాత్తుగా ఆరిపోతున్న లైట్లు!

రైళ్లను ఎందుకు రద్దు చేశారంటే?

రైళ్ల రద్దుకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వివరాలను వెల్లడించింది. భద్రత, ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల నిర్వహణను సులభతరం చేయడానికి తాత్కాలిక సస్పెన్షన్ అవసరమని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రయాణికులు రైలు షెడ్యూల్ ను ముందుగానే తనిఖీ చేయాలని, ప్రభావిత తేదీలలో వారి ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Read Also: హైస్పీడ్ రైల్ హబ్ గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ల లింక్ ఇక్కడే!

రెండు రోజుల తర్వాత తిరిగి రైలు సర్వీసులు ప్రారంభం

దక్షిణ మధ్య రైల్వే ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత సాధారణ సేవలు తిరిగి ప్రారంభమవుతాయని వివరించింది. సౌత్ సెంట్రల రైల్వే జోన్ అంతటా మౌలిక సదుపాయాలు అప్ డేట్ చేసే సమయంలో వీలైనంత వరకు ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే ఈ కార్యకలాపాలను చేపడుతున్నారు.

Read Also: వందే భారత్‌కు బాంబు ముప్పు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఆగంతకుడి లేఖ.. వణికిపోతున్న ప్రయాణికులు!

Related News

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×