E-Paper
Advertisement

Indian Train: రంగు రంగుల రైళ్లు.. ఒక్కో కలర్ వెనక ఒక్కో కథ!

Indian Train:  రంగు రంగుల రైళ్లు.. ఒక్కో కలర్ వెనక ఒక్కో కథ!
Advertisement

Indian Train Colour Codes: రైల్వే స్టేషన్లలో అడుగుపెట్టిన వెంటనే అందరికీ కామన్ గా ట్రాక్స్ మీద నిలబడ్డ రైళ్లు కనిపిస్తాయి.  ఒక్కో రైలు ఒక్కో రంగులో ఉంటుంది.  నీలం, ఎరుపు, తెలుపు సహా పలు రంగుల్లో కనిపిస్తాయి. ఈ రంగులు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా,  అంతర్గతంగా ఓ విషయాన్ని వెల్లడించే ప్రయత్నం చేస్తాయి. ఆ రైలు ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో వెల్లడిస్తాయి. అదే సమయంలో ఆ రైలు పాతదా? కొత్తదా? అనేది వివరించే ప్రయత్నం చేస్తుంది.

ఇంతకీ రైళ్ల రంగుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి?

⦿ బ్లూ కోచ్‌లు: భారత్ లో నీలిరంగు కోచ్‌లు అత్యంత సాధారణం. ఇవి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించిన పాత తరహా కోచ్‌లు. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్తాయి. మెయిల్, ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ఎక్కువగా నీలిరంగులో ఉంటాయి. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సులభంగా అందుబాటులో ఉంటాయి. ఆధునిక సౌకర్యాలు లేకపోయినా, ఈ కోచ్‌లు పాతకాలపు సౌకర్యాన్ని అందిస్తాయి.

Advertisement

⦿ రెడ్ కోచ్‌లు: ఇటీవల, ముఖ్యంగా రద్దీ మార్గాల్లో, ఎరుపు కోచ్‌లు (LHB కోచ్‌లు) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి ఎక్కువ వేగం, భద్రత, సౌకర్యాన్ని అందిస్తాయి. ఎరుపు కోచ్ అంటే ఆధునిక, సుఖవంతమైన ప్రయాణానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. ఈ కోచ్‌లు ప్రమాదాల సమయంలో మరింత పటిష్టంగా ఉండేలా రూపొందించబడ్డాయి. సూపర్‌ ఫాస్ట్,  ప్రీమియం రైళ్లు ఎక్కువగా ఈ కోచ్‌లను ఉపయోగిస్తున్నాయి.

⦿ వైట్ కోచ్‌లు: కొత్త తరహా వైట్ రైళ్లు, వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ లు. ఇవి ఫ్యూచరిస్టిక్ రైళ్లలా కనిపిస్తాయి. ఇవి ట్రైన్‌ సెట్ రూపంలో ఉంటాయి. ఇంజిన్, కోచ్‌లు ఒకే యూనిట్‌ గా ఉంటాయి. వైట్ కోచ్‌లు వేగం, ఆధునిక సౌకర్యాలు, ప్రీమియం ప్రయాణానికి గుర్తింపు. కొత్త ఇంటీరియర్, అధిక వేగం, సౌకర్యాలు ఇందులో ఉంటాయి.

రంగులు అన్ని విషయాలు చెప్పవు!   

Advertisement

రైళ్ల రంగులను చూసి కొన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉన్నా, అన్ని వివరాలు తెలియదు. రెడ్ కలర్ రైలు ఎల్లప్పుడూ వేగంగా ఉండదు, నీలం రైలు ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉండదు. అసలు వివరాలు రైలు టైప్, కోచ్ క్లాస్, సమయాలు, టికెట్ వివరాల ద్వారా తెలుసుకోవాలి.

Read Also: రైళ్లపై రాళ్లు.. సరదా తీరిపోయే వరకు జైలు శిక్ష, వామ్మో.. అన్నేళ్లా?

రైళ్ల రంగులతో కలిగే లాభం

రద్దీ స్టేషన్లలో రంగులు రైలును ఈజీగా గుర్తుపట్టేలా చేస్తాయి. కొత్తదా? పాతదా? సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవి సాధారణ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. రైల్వే రంగులు గమనించడం వల్ల,   రైల్వే నెట్‌ వర్క్‌ లోని వివిధ రైళ్ల వివనాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: బిగ్ అప్డేట్.. సికింద్రాబాద్ స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×