E-Paper
Advertisement

My Village Show Anil: మై విలేజ్ షో అనిల్ ఇంట తీవ్ర విషాదం…

My Village Show Anil: మై విలేజ్ షో అనిల్ ఇంట తీవ్ర విషాదం…
Advertisement

My Village Show Anil: ఇటీవల కాలంలో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ ద్వారా ఫేమస్ అవుతూ సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటూ సెలబ్రిటీ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న వారిలో ప్రముఖ యూట్యూబర్ అనిల్ జీలా(Anil Geela) ఒకరు. మై విలేజ్ షో(My Village Show) అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన అనిల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

అనిల్ జీలా తండ్రి మరణం..

ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనిల్ జీలా తండ్రి మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయాన్ని అనిల్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఈయన తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఇతర యూట్యూబర్స్ ఈ పోస్ట్ పై స్పందిస్తూ అనిల్ తండ్రి మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ తో ఫేమస్..

Advertisement

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దర్గాపల్లి గ్రామానికి చెందిన అనిల్ గంగవ్వతో కలిసి గ్రామీణ నేపథ్యంలో గ్రామీణ జీవితం ఎలా ఉంటుందనే విషయాల గురించి వీడియోలు చేస్తూ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు.ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి నటనపై ఆసక్తితో యూట్యూబ్ రంగంలోకి వచ్చారు. ఇక అనిల్ భార్య పేరు ఆమని (Aamani)ఈమె కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా బిజినెస్ కూడా ప్రారంభిస్తూ మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు..

Advertisement

అనిల్ ఆమని దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ఇక త్వరలోనే ఈమె మరో బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నారు. ఇలా తమ కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారన్న తరుణంలో తన తండ్రి మరణించడంతో అనిల్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. మై విలేజ్ షో అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్న అనిల్ ప్రస్తుతం మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నుంచి తప్పకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మై విలేజ్ షో అధికారికంగా తెలియజేసింది. ఇక ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించిన ఇస్మార్ట్ జోడి(Ismart Jodi) కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనిల్ ఆమని సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×