E-Paper
Advertisement

Indian Railways: రైళ్లలో ఆ ఫుడ్ సరఫరా చేస్తున్నారా? మానవ హక్కుల సంఘం నోటీసులపై రైల్వే రిప్లై ఇదే!

Indian Railways: రైళ్లలో ఆ ఫుడ్ సరఫరా చేస్తున్నారా? మానవ హక్కుల సంఘం నోటీసులపై రైల్వే రిప్లై ఇదే!
Advertisement

Halal Certified Food: భారతీయ రైళ్లలో హలాల్ సర్టిఫైడ్ ఆహారాన్ని సరఫరా చేయడానికి, విక్రయించడానికి అధికారిక నిబంధనలు ఏవీ లేవని రైల్వే బోర్డు వెల్లడించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన నోటీసులు రైల్వే అధికారిక వివరణ ఇచ్చింది. భారతీయ రైల్వేలు మాంసాహార భోజనంలో హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే అందిస్తాయని, ఓ వర్గానికి వివక్ష జరుగుతుందని కొంత మంది మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే NHRC ఇండియన్ రైల్వేను  వివరణ కోరింది.

 నిబంధనలకు అనుగుణంగా ఆహార సరఫరా

రైళ్లలో సరఫరా చేసే అన్ని రకాల ఫుడ్స్ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనలకు లోబడి ఉంటున్నాయని రైల్వే బోర్డు జాతీయ మానవ హక్కుల సంఘానికి వివరించింది. క్యాటరింగ్ వ్యవస్థలో హలాల్ సర్టిఫికేషన్ కోసం ఎటువంటి ఆదేశం లేదని తెలిపింది. “భారతీయ రైల్వేలలో హలాల్ సర్టిఫైడ్ ఆహారాన్ని అందించడానికి అధికారిక నిబంధనలు ఏవీ లేవు. ఆ నిబంధనలు రూపొందించాలనే ఆలోచన కూడా రైల్వే చేయడం లేదు” అని వివరించింది.

అసలు ఏం జరిగిందంటే?

Advertisement

రైల్వే అధికారులు ప్రధాన సమాచార కమిషన్ (CIC) ముందు ఇటీవల జరిగిన కేసును కూడా ఎత్తి చూపారు. ఒక RTI దరఖాస్తుదారుడు హలాల్ చేసిన మాంసం రైల్లో వడ్డిస్తున్నారా? అని ప్రశ్నించారని చెప్పారు. హలాల్ సర్టిఫైడ్ ఆహారం అందించబడదని, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)లో అలాంటి విధానం అమల్లో లేదని  రైల్వేలు CIC ముందు వెల్లడించాయి.  హలాల్ సర్టిఫైడ్ ఆహారానికి సంబంధించిన ఎటువంటి రికార్డులు, విధానాలకు సంబంధించిన  ప్రోటోకాల్‌ లేదని చీఫ్ ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ధృవీకరించారని వెల్లడించారు. రైల్వేలో యూనిఫామ్ ఫుడ్ సరఫరా ఉంటుందని, నిర్ధిష్ట మత పరమైన విధానాలను అనుసరించదని రైల్వేబోర్డు సమాధానం చెప్పింది.

Read Also: ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?

కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్

Advertisement

మొత్తంగా గత కొంత రైళ్లలో మాంసాహార సరఫరా గురించి జరుగుతున్న ప్రచారానికి రైల్వే బోర్డు తాజాగా ఫుల్ స్టాఫ్ పెట్టినట్లు అయ్యింది. ఇకపై రైల్వేలో వడ్డించే ఆహారం హాలాల్ చేయాలి.. చేయకూడదు అనే నిబంధన ఏమీ లేదని ప్రయాణీకులు అర్థం చేసుకోవాలని సూచించింది.

Read Also: మందు కొట్టి రైలు నడిపిన లోకో పైలెట్, స్టేషన్ లో ఆపకుండానే..

Related News

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

న్యూక్లియర్ రియాక్టర్ వేడితో హైడ్రోజన్ ఉత్పత్తి.. భారత టెక్నాలజీకి ప్రపంచం షాక్!

పాదరక్షలు లేకుండా 32 కి.మీ నడక.. సింహాచల గిరి ప్రదక్షిణ విశిష్టత ఇదే!

రోడ్లపై ఎండ.. భవనాలపై వర్షం.. చైనా కొత్త కూలింగ్ టెక్నిక్ కు ప్రపంచం ఫిదా!

Big Stories

Advertisement
×