E-Paper
Advertisement

Drunken Loco Pilot: మందు కొట్టి రైలు నడిపిన లోకో పైలెట్, స్టేషన్ లో ఆపకుండానే..

Drunken Loco Pilot: మందు కొట్టి రైలు నడిపిన లోకో పైలెట్, స్టేషన్ లో ఆపకుండానే..
Advertisement

తరచుగా మద్యం తాగి వాహనాలను నడిపే వారిని చూస్తుంటాం. బైక్, ఆటో, కారు, కొన్నిసార్లు బస్సు, లారీ డ్రైవర్లు కూడ తాగి నడిపి పోలీసులకు పట్టుబడిన సందర్భాలున్నాయి. కానీ, తాజాగా ఓ మహానుభావుడు పీకలదాక మందుతాగి ఏకంగా రైలు నడిపాడు. మధ్యలో ఓ రైల్వే స్టేషన్ లో రైలు ఆపకుండానే వెళ్లిపోవడంతో అసలు కథ బయటకు వచ్చింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జర్మనీలో అత్యంత జనాభా కలిగిన రాష్ట్రం నార్త్ రైన్ వెస్ట్‌ ఫాలియా. నిత్యం ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ, తాజాగా ఓ ఊహించని ఘటన జరిగింది. ఆదివారం నాడు రద్దీగా ఉన్న ప్యాసింజర్ రైలును నడిపిన లోకో పైలెట్ బాగా మద్యం తాగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆపకుండా వెళ్లిపోవడంతో..

Advertisement

RE6 అనే రీజినల్ రైలు నార్త్ రైన్ వెస్ట్‌ ఫాలియాలోని రీడా వైడెన్‌ బ్రూక్ పట్టణంలోని స్టేషన్‌ లో ఆగాల్సి ఉంది. కానీ, లోకో పైలెట్ ఆ స్టేషన్ లో ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంత దూరంలో ఓపెన్ ట్రాక్ మీద రైలు ఆపాడు. ముందుగా ఏదైనా టెక్నికల్ సమస్యతో అలా చేసి ఉండొచ్చని అనుమానించారు. కానీ, ఆ తర్వాత ఎలాంటి సమస్యల లేకపోయినా అతడు రైలును ముందుకు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రైల్వే మానిటరింగ్ అధికారులు ఆయన మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?

రక్త పరీక్షల్లో మద్యం సేవించినట్లు వెల్లడి

Advertisement

స్పాట్ కు చేరుకున్న పోలీసులు లోకో పైలెట్ కు రక్త పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అతడు మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. ఎక్కువ మొత్తంలో ఆయన మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. ఆయన రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ (BAC) 0.267% ఉన్నట్లు వెల్లడైంది.  నిజానికి జర్మనీలో ఎవరైనా వ్యక్తి రక్తంలో 0.05% ఆల్కహాల్ కంటెంట్ ఉండి వాహనాలు నడిపితే, మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా పరిగణించబడుతుంది. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, ప్రజా రవాణాలో పనిచేసే వారి విషయంలో ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మద్యం తీసుకోవడానికి అనుమతి లేదు. RE6 లో ఉన్న దాదాపు 250 మంది ప్రయాణికులను సేఫ్ గా రైలు నుంచి దింపినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. రైలు నడిపిన లోకో పైలెట్ ను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా లోకో పైలెట్ చేసిన ఈ పనికి ప్రయాణీకులంతా షాకయ్యారు.

Read Also:  19 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×