E-Paper
Advertisement

IRCTC eWallet: రైలు టికెట్స్ త్వరగా బుక్ చేసుకోవాలా? IRCTC eWalletను ఇలా వాడేయండి!

IRCTC eWallet: రైలు టికెట్స్ త్వరగా బుక్ చేసుకోవాలా? IRCTC eWalletను ఇలా వాడేయండి!
Advertisement

Indian Railways eWallet: రైల్వే ప్రయాణీకులలో సుమారు 75 శాతానికి పైగా ఆన్ లైన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు రకరకాల వ్యాలెట్స్ ద్వారా టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సార్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే ఈ వాలెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC eWalletని పరిచయం చేసింది. ఈ వాలెట్ తో టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటుంది రైల్వే సంస్థ.

IRCTC eWalletతో బోలెడు లాభాలు

Advertisement

ఇండియన్ రైల్వే అధికారి IRCTC eWalletలో టికెట్స్ బుకింగ్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు ఈ వాలెట్ చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం కూడా IRCTC eWalletని ఉపయోగించుకుని త్వరగా టికెట్స్ కన్ఫార్మ్ చేసుకోవచ్చు.  మీ బ్యాంకు సర్వర్ పని చేయకపోతే IRCTC eWallet ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే eWallet లో రూ. 100 నుంచి రూ. 1000 వరకు యాడ్ చేసుకునే అవకాశం ఉంది.

IRCTC eWalletని ఎలా ఉపయోగించుకోవాలి?   

Advertisement

⦿ ముందుగా https://www.irctc.co.in  సైట్ ను ఓపెన్ చేయాలి. మొదటిసారి ఓపెన్ చేస్తే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.

⦿ ‘IRCTC ఎక్స్‌ క్లూజివ్’ బటన్ కింద ఉన్న ‘IRCTC eWallet’పై క్లిక్ చేయాలి. IRCTC లావాదేవీ పాస్‌ వర్డ్‌ ను ఎంటర్ చేయాలి.

⦿ ఆ తర్వాత, మీరు IRCTC హోమ్‌ పేజీకి వెళ్తారు. ఇప్పుడు మీ వివరాలు ఉపయోగించి లాగిన్ కావాలి.

⦿ ‘IRCTC ఎక్స్‌ క్లూజివ్’ ట్యాబ్ ను క్లిక్ చేసి, eWallet లో వివరాలను ఎంటర్ చేయాలి.

⦿ ‘IRCTC eWallet డిపాజిట్’పై క్లిక్ చేసి, UPI, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత IRCTC సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Read Also: ఏం వాడకమయ్యా.. డ్రోన్లతో రైలు బోగీల క్లీనింగ్, ఎక్కడో కాదు ఇక్కడే!

IRCTC eWalletతో ప్రయోజనాలు

⦿IRCTC eWallet సురక్షితమైన లావాదేవీలను అందిస్తుంది. టికెట్ బుకింగ్ ఈజీగా ఉంటుంది. టైమ్ సేవ్ అవుతుంది.

⦿ IRCTC eWalletతో టికెట్ బుక్ చేసుకుంటే గేట్‌ వే ఛార్జీలు ఉండవు.

⦿ IRCTC eWalletని ఆన్‌ లైన్‌లో టాప్ అప్ చేసుకోవచ్చు. మీ బ్యాంకు సర్వర్ డౌన్ అయిన సమయంలో ఈజీగా IRCTC eWallet ఉపయోగించి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

⦿టికెట్‌ ను రద్దు చేస్తే సులభంగా రీఫండ్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు.

⦿ ఈజీగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి IRCTC eWalletని ఉపయోగించవచ్చు. విమాన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Read Also: జర్మనీ రికార్డ్ బ్రేక్.. రెండేళ్లలో మరో 500 రైల్వే స్టేషన్లకు మహర్దశ: రైల్వే మంత్రి!

Related News

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Big Stories

Advertisement
×