Indian Trains Cleaning: భారతీయ రైల్వే రోజు రోజుకు టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. రైళ్ల తయారీ నుంచి.. రైళ్ల క్లీనింగ్ వరకు అన్ని విషయాల్లోనూ సాంకేతికతను వినియోగించుకుంటున్నది. తక్కువ మ్యాన్ పవర్ తో సమర్థవంతంగా పనులను పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైళ్ల క్లీనింగ్ కు సంబంధించి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు రైళ్లను మనుషులు లేదంటే క్లీనింగ్ మెషీన్లు శుభ్రం చేసేది. కానీ, ఇకపై డ్రోన్లు ఆ బాధ్యత తీసుకోబోతున్నాయి. తాజాగా డ్రోన్ క్లినింగ్ కు సంబంధించి భారతీయ రైల్వే టెస్టింగ్ నిర్వహించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైళ్లను క్లీన్ చేస్తున్న లేటెస్ట్ డ్రోన్లు
రైలు బోగీలను శుభ్రం చేసేందుకు డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే భావిస్తోంది. అందులో భాగంగానే తాజాగా టెస్ట్ క్లీనింగ్ నిర్వహించారు. డ్రోన్ కు ఓ పైప్ ఫిక్స్ చేస్తారు. ఆ పైప్ ను డిటర్జెంట్ వాటర్ లో ఉంచుతారు. ఓ ఆపరేటర్ డ్రోన్ ను ఆపరేట్ చేస్తుంటాడు. సబ్బు నీళ్లు రైలు బోగీ మీద స్ప్రే అవుతాయి. మరోసారి మంచి నీటితో రైలు బోగీని శుభ్రం చేస్తారు. డ్రోన్ తో రైళ్ల క్లీనింగ్ అనేది కాస్త ఇబ్బంది కరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. డ్రోన్లతో క్లీనింగ్ చాలా టైమ్ పడుతుంది. దానికి ఒక ఆపరేటర్ కావాలి. దాని కంటే, క్లీనింగ్ మెషీన్స్‌తో శుభ్రం చేస్తేనే బెటర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న ఆటో మేటిక్ క్లీనింగ్ విధానం చాలా బాగుందనే టాక్ వినిపిస్తోంది.
Indian Railways using drones to clean the trains.
Such video from US or China would catch eyeballs immediately..pic.twitter.com/qaGsE0gqYF
— Frontalforce 🇮🇳 (@FrontalForce) May 21, 2025
ప్రస్తుతం రైళ్లను ఎలా క్లీన్ చేస్తున్నారంటే?
నిజానికి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చే రైళ్లను శుభ్రం చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ప్రయాణాన్ని ముగించి, మళ్లీ మొదలు పెట్టే సమయానికి రైళ్లను నీట్ గా చేస్తారు. ప్రయాణ సమయంలో అపరిశుభ్రంగా ఉంటే రైల్వే సిబ్బంది శుభ్రం చేస్తారు. అయితే, ఇలా చేయడం వల్ల రైల్వేకు ఆర్థిక భారం కలిగేది. కానీ, ఆ తర్వాత డిపోలలో సిబ్బంది రైళ్లను శుభ్రం చేసే వాళ్లు. అయినా, సమయం ఎక్కువగా పట్టేది. ఈ నేపథ్యంలో రైల్వే మెషీన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్ద రైల్వే స్టేషన్లలో ఆటో మేటిక్ వ్యస్థను ఏర్పాటు చేశారు. గతంలో సిబ్బంది చేతులతో, రసాయనాలను ఉపయోగించి నీటితో శుభ్రం చేసే వాళ్లు. కానీ, ఆ తర్వాత ఆటోమేటెడ్ రైల్వే కోచ్ వాషింగ్ ప్లాంట్స్ ను తీసుకొచ్చింది. రైలు ఈ ప్లాంట్ మధ్యలో నుంచి వెళ్తుంటే, పట్టాల పక్కనే అమర్చిన పొడవైన స్క్రబ్బర్లు కోచ్ లను శుభ్రం చేసేవి. ఇప్పటి వరకు చాలా వరకు రైలు క్లీనింగ్ విధానాలు అమల్లోకి వచ్చినా, ఈ విధానమే బాగుందంటున్నారు రైల్వే అధికారులు. డ్రోన్ల వినియోగంపై త్వరలో రైల్వే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
From hand press to systematic switch. pic.twitter.com/J9jaTnmUrJ
— Ministry of Railways (@RailMinIndia) February 26, 2023
Read Also: గాలొస్తే గలగలా.. వానొస్తే లొడలొడా.. ఇదీ.. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన చర్లపల్లి స్టేషన్ దుస్థితి!