Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా బుధవారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Mumbai Indians vs Delhi Capitals ) మధ్య మ్యాచ్.. జరిగింది. ప్లే ఆఫ్ కు చీరాల అంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించగా… ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో 59 పరుగులు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తు చేసింది ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ). ఈ విజయంతో నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్ళింది ముంబై ఇండియన్స్.
Also Read: Ben Cutting – RCB: ఆ రాక్షసుడు వస్తున్నాడు..రోజుకు 150 మెసేజ్ లు..ఇక RCBకి పీడకలే
ముంబై ఇండియన్స్ కాదు.. అంపైర్ ఇండియన్స్ ?
బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవడం పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఎప్పటిలాగే అంబానీ… అంపైర్ లను కొనుగోలు చేసి… మ్యాచ్ గెలిపించుకున్నాడని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో మొత్తం మూడు సంఘటనల్లో… మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని తేల్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. ఇందులో ముంబై స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ వేసిన ఓ బంతి నో బాల్ అయినప్పటికీ… సరైన బంతిగా అంపైర్ డిక్లేర్ చేశాడు. వికెట్లకు దూరంగా తన కాళ్ళను కదుపుతూ బౌలింగ్ చేశాడు ఈ న్యూజిలాండ్ ఆటగాడు. అయితే ఐపీఎల్ రూల్స్ ప్రకారం… అతడు వేసింది నోబాల్ అయినప్పటికీ.. అంపైర్ మాత్రం చీమకుట్టినట్టు కూడా స్పందించలేదు.
అలాగే విప్రాజ్ ( vipraj) నేరుగా బౌలర్ తలపై నుంచి సిక్సర్ బాదాడు. అయితే ఆ బంతి సిక్స్ వెళ్లినప్పటికీ.. అంపైర్ చూడకుండా బౌండరీ అని ఇచ్చేశాడు. వాస్తవానికి ఆ బంతి ఫోర్గేట్ ను బలంగా తాకి మళ్లీ గ్రౌండ్లో పడి…. బౌండరీ గేటును తాకింది. దీంతో బౌండరీ మాత్రమే ఇచ్చాడు అంపైర్. అలాగే ఢిల్లీ ఆటగాడు పోరెల్.. నాట్ అవుట్ అయినా కూడా అవుట్ అంటూ ప్రకటించారు. ఇలా ఒక్కటేమిటి… చాలానే తప్పిదాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
హార్దిక్ పాండ్యా చేతిలో కాగితం
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ ( Mumbai Indians vs Delhi Capitals ) మధ్య జరిగిన మ్యాచ్ లో.. మరో సంఘటన జరిగింది. హార్దిక్ పాండ్యా కు జయవర్ధనే ఓ కాగితం పంపించినట్లు సోషల్ మీడియాలో… ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ కాగితం ముక్కను హార్దిక్ పాండ్యా చదవడమే కాకుండా అంపైర్లు కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఆ స్క్రిప్ట్ ప్రకారమే… ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడినట్లు చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read: Nita Ambani: 6వ ట్రోఫీ అంటూ సిగ్నల్స్.. గెలిచాక ముంబై ప్లేయర్లను అవమానించిన నీతా అంబానీ
?igsh=c3lxNjI1M2l4cGJ3