E-Paper
Advertisement

Rangareddy News: జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ .. విద్యార్థుల మధ్య ఫైటింగ్, పోలీసులు రంగ ప్రవేశం

Rangareddy News: జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ .. విద్యార్థుల మధ్య ఫైటింగ్, పోలీసులు రంగ ప్రవేశం
Advertisement

Rangareddy News: మరో మూడు నెలల్లో పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఇంటర్ విద్యార్థులు. అంతలోనే ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌పై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఆపై ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. అంతేకాదు స్థానిక గ్యాంగ్‌లు ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో వెలుగు చూసింది.

జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ భూతం

Advertisement

చక్కగా చదువుకోవాలని తమ పిల్లలను కాలేజీలకు పంపిస్తారు తల్లిదండ్రులు.  తాము ఎందుకు వచ్చామనే సంగతి మరిచిపోయిన విద్యార్థులు..  నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి.  శంషాబాద్‌లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్టియిర్ స్టూడెంట్స్‌పై ర్యాగింగ్ చేయడం దుమారం రేపుతోంది.

దీంతో సీనియర్-జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్దులపై డెస్ కాలర్ విద్యార్థులు- స్థానిక గ్యాంగ్‌తో దాడికి ప్రయత్నం చేశారు. విద్యార్థుల మధ్య వ్యవహారం కాస్త కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు.

Advertisement

సీనియర్-జూనియర్ విద్యార్థుల మధ్య దాడులు

విద్యార్థుల తల్లిదండ్రులను రప్పించింది కళాశాల యాజమాన్యం. తల్లిదండ్రులు-విద్యార్థుల సమక్షంలో కాలేజీ యాజమాన్యం చర్చిస్తోంది. విద్యార్దుల ఘర్షణ‌పై ఆరా తీస్తున్నారు పోలీసులు. విద్యార్దుల పేరెంట్స్ ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే ఘర్షణలకు సంబంధించి దృశ్యాలు కాలేజీలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ALSO READ:  హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు..  ఫేమస్ హోటళ్ల ఓనర్ల ఇళ్లపై దాడులు

అయితే వాటిని గోప్యంగా ఉంచింది యాజమాన్యం. కళాశాల వార్డెన్.. విద్యార్థులకు సిగరెట్లు సరఫరా చేస్తున్నట్లు బలమైన ఆరోపణ ఉంది. కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు స్థానికులు. కళాశాలలో తరచు గొడవలు జరుగుతాయని ఆరోపిస్తున్నారు. గతంలో ఆ తరహాలో ర్యాగింగ్‌కు కారణమైన ఇద్దరు విద్యార్ధులకు టీసీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×