E-Paper
Advertisement

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10.. ఊహించని టాస్క్ లు.. ఎవరు అంచనా వేయలేని ఎలిమినేషన్స్.. ఒక్కటేమిటి ఎన్నో ఎన్నెన్నో.. ట్విస్టులు ఆడియన్స్ కు షోపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఎట్టకేలకు దశావతారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం స్టార్ మా ఛానల్ తో పాటు జియో హాట్ స్టార్ ఓటీటీ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ బిగ్ బాస్ సౌత్ కార్నివాల్ అంటూ ఏకంగా తెలుగులో నాగార్జున, మలయాళం మోహన్ లాల్, తమిళ్ విజయ్ సేతుపతి , కన్నడ కిచ్చా సుదీప్ నలుగురు హోస్టులు.. నాలుగు భాషలు.. ఒకేరోజు ప్రారంభం కావడంతో సౌత్ ఆడియన్స్ కి మరింత ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 6వ తేదీన నలుగురు హోస్టులు తమ తమ షోల నుండి కలసి కనిపించి బిగ్ బాస్ ఘనవిజయం సాధించాలని ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు.

ఓటిటిలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బిగ్ బాస్ తెలుగు…

ముఖ్యంగా నలుగురు బడా హీరోలు.. నాలుగు భాషలలో ఒకే కాలంలో బిగ్ బాస్ షో కొత్త సీజన్ ప్రారంభించడంతో.. ఈసారి ఏ భాష బిగ్ బాస్ మంచి రేటింగ్ అందుకుంటుంది అని అందరూ ఆతృతగా ఎదురు చూడగా.. ఎవరు ఊహించని విధంగా ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మాణంలో బిగ్ బాస్ తెలుగు జియో హాట్ స్టార్ ఓటీటీలో తెలుగులో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 10. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఎండెమోల్ షైన్ ఇండియా బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ జియో హాట్ స్టార్ లో తెలుగు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏకంగా మొదటి వారంలోనే అగ్రగామిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడుదలైన వారంలోనే ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంతో షోపై, సీజన్ పై అలాగే హోస్ట్ నాగార్జున పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వారంలోనే ఈ రేంజ్ పాపులారిటీ..

Advertisement

ఇకపోతే తాజా ర్యాంకింగ్ బిగ్ బాస్ పట్ల తెలుగు ప్రేక్షకుల ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రేక్షకులు ఈ షోని ఎక్కువగా చూస్తున్నారు. ఈ విజయం భారతదేశంలో బిగ్ బాస్ బ్రాంచ్ నిర్మించే బనిజయ్ ఆసియాలో భాగమైన ఎండెమోల్ షైన్ ఇండియా బిగ్ బాస్ శక్తివంతమైన మల్టీ మార్కెట్ వినోద ఫ్రాంచైజీ గా నిర్మించింది.. ఏది ఏమైనా ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలుగు బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం ప్రశంసనీయమని చెప్పవచ్చు.

ALSO READ:రైలు మీద తెగిపడ్డ ఓవర్‌ హెడ్ వైర్లు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

16 మందితో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం..

Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విషయానికి వస్తే ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. పదిమంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. 6 మంది కామనర్స్ అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే హౌస్ లోకి వచ్చిన మొదటి వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా కామనర్ కేటగిరీలో ఆర్ జె చరణ్, సెలబ్రిటీ కేటగిరిలో చైత్ర రాయ్ ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ముగ్గురు హౌస్మెట్స్ గా మారగా 11మంది డేంజర్ జోన్ లో పడ్డారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Karthika Deepam 2 Serial Today Episode September 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు మాలిని షాక్ – హాస్పిటల్ లో దీప          

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Big Stories

Advertisement
×