E-Paper
Advertisement

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!
Advertisement

Ather Konark Rivals: ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు ఉపయోగపడే స్కూటర్ల విషయంలో ఈవీలు కూడా ఇప్పుడు పెట్రోల్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. టీవీఎస్ ఐక్యూబ్, రివర్ ఇండీ, ఏథర్ రిజ్టా లాంటి మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏథర్ కోనార్క్ కూడా ఫ్యామిలీ స్కూటర్ విభాగంలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే పెట్రోల్ వాహనాన్నే ఎంచుకోవాలని భావించే వారికి మార్కెట్లో మంచి ఆప్షన్లు ఉన్నాయి. కోనార్క్ తో పోటీ పడే ఈ ఆరు స్కూటర్లను ఇప్పుడు పరిశీలిద్దాం..

హోండా యాక్టివా

దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. సింపుల్ డిజైన్, సులభమైన వినియోగం, కుటుంబ అవసరాలకు సరిపోయే స్వభావం దీని ప్రధాన బలాలు. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, మార్కెట్‌కు వెళ్లడం వంటి అవసరాలకు ఇది చాలాకాలంగా వినియోగదారుల బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.76,083.

హోండా యాక్టివా 125

Advertisement

కొంచెం ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి యాక్టివా 125 మరో ఎంపిక. యాక్టివా కంటే పెద్ద ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ కుటుంబ అవసరాలతో పాటు కొంత ఎక్కువ దూరం ప్రయాణించేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.91,178.

టీవీఎస్ జూపిటర్ 110

ఫ్యామిలీ స్కూటర్ విభాగంలో టీవీఎస్ జూపిటర్‌కు కూడా మంచి పేరు ఉంది. సౌకర్యవంతమైన రైడింగ్, ప్రాక్టికల్ డిజైన్ కారణంగా ఇది రోజువారీ వినియోగానికి అనువైన మోడల్‌గా నిలుస్తోంది. పెట్రోల్ స్కూటర్ కొనాలనుకునేవారు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ.74,125.

టీవీఎస్ జూపిటర్ 125

Advertisement

జూపిటర్‌లో మరింత శక్తివంతమైన వెర్షన్ కావాలంటే 125 మోడల్‌ను చూడొచ్చు. ఎక్కువ సామర్థ్యం ఉన్న స్కూటర్ కావాలనుకునే కుటుంబ వినియోగదారులకు ఇది నచ్చుతుంది. దీని ప్రారంభ ధర: రూ.81,700.

సుజుకి యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125 కూడా భారత మార్కెట్లో చాలాకాలంగా ఉన్న ప్రముఖ పెట్రోల్ స్కూటర్లలో ఒకటి. 125cc విభాగంలో మంచి ఆప్షన్ కోసం చూస్తున్న వారికి ఇది నచ్చుతుంది. కుటుంబ వినియోగంతో పాటు రోజువారీ రాకపోకలకు కూడా ఇది సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.82,185.

సుజుకి బర్గ్‌ మన్ స్ట్రీట్

మిగతా మోడళ్లతో పోలిస్తే కొంత ప్రత్యేకమైన డిజైన్ కోరుకునేవారికి సుజుకి బర్గ్‌ మన్ స్ట్రీట్ నచ్చుతుంది. దీని మ్యాక్సీ స్కూటర్ లుక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. సాధారణ ఫ్యామిలీ స్కూటర్లకు భిన్నమైన స్టైలింగ్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని ప్రారంభ ధర: రూ.1.03 లక్షలు.

Read Also: బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

Tags

Related News

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

Big Stories

Advertisement
×