E-Paper
Advertisement

వందే భారత్ vs రాజధాని ఎక్స్‌ ప్రెస్.. ప్రయాణికులకు ఏ రైలు బెటర్.. పూర్తి వివరాలు ఇవిగో!

వందే భారత్ vs రాజధాని ఎక్స్‌ ప్రెస్.. ప్రయాణికులకు ఏ రైలు బెటర్.. పూర్తి వివరాలు ఇవిగో!
Advertisement

Vande Bharat vs Rajdhani Express: భారతీయ రైల్వేలో ప్రీమియం ప్రయాణం అనగానే గుర్తొచ్చే పేరు వందేభారత్ ఎక్స్ ప్రెస్. కానీ, ఒకప్పుడు రాజధాని ఎక్స్‌ ప్రెస్ గుర్తుకు వచ్చేది. ఈ రెండు రైళ్లు ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో   ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే, ఈ రెండు రైళ్ల మధ్య తేడాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రాజధాని vs వందే భారత్  

రాజధాని ఎక్స్‌ ప్రెస్ 1969లో న్యూఢిల్లీ నుంచి హౌరా మధ్య ప్రారంభమైంది. దాదాపు 1,450 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసేలా అప్పట్లో దీన్ని రూపొందించారు. ప్రధాన నగరాలను ఢిల్లీతో వేగంగా అనుసంధానించడం దీని ప్రధాన ఉద్దేశం. వందే భారత్ మాత్రం చాలా కొత్తది. తొలి సర్వీస్ 2019లో న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రారంభమైంది.   తక్కువ దూరంలోని నగరాల వేగంగా ప్రయాణించేందుకు దీన్ని రూపొందించారు.

వేగంలో ఏది ముందు?   

Advertisement

వేగం విషయానికి వస్తే సాధారణ వందే భారత్‌ ముందుంది. అనుకూలమైన ట్రాక్ సెక్షన్లలో ఇది గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు. అయితే, మొత్తం ప్రయాణం అంతా అదే వేగంతో నడవదు. ట్రాక్ పరిస్థితులు, సిగ్నల్స్, స్టేషన్లు, ట్రాఫిక్ వంటి అంశాలపై ప్రయాణ సమయం ఆధారపడి ఉంటుంది. రాజధాని రైళ్ల గరిష్ట వేగం సాధారణంగా గంటకు 130 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది.

రాత్రి ప్రయాణానికి ఏది బెస్ట్?   

ఇక్కడే రాజధాని ప్రత్యేకత కనిపిస్తుంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వందేభారత్ స్లీపర్ కాకుండా, సాధారణ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లాంటి సీటింగ్ ఆప్షన్లు ఉంటాయి. ప్రయాణికులు తమ సీట్లలోనే కూర్చుని గమ్యస్థానానికి చేరుకోవాలి. రాజధానిలో మాత్రం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి స్లీపర్ తరగతులు ఉన్నాయి. రాత్రి రైలు ఎక్కి, భోజనం చేసి, బెర్త్‌ పై నిద్రపోయి ఉదయం గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఎక్కువ గంటల ప్రయాణాలకు చాలా బాగుంటుంది. అయితే, వందే భారత్ స్లీపర్ రైళ్లు రావడంతో ఈ తేడా కొంత తగ్గుతోంది.

ఫుడ్ ఎలా ఉంటుంది?

Advertisement

రెండు రైళ్లలోనూ ప్రయాణ సమయాన్ని బట్టి క్యాటరింగ్ సదుపాయం ఉంటుంది. వందే భారత్‌లో టీ, బ్రేక్ ఫాస్ట్,  భోజనం, స్నాక్స్, డిన్నర్ లాంటి ఆప్షన్లు మార్గాన్ని బట్టి అందిస్తారు. పోహా, ఉప్మా, పరాఠా, శాండ్‌ విచ్‌ లు, అన్నం, పప్పు, కూరగాయలు, పనీర్, చికెన్ లాంటివి మెనూలో ఉండొచ్చు. రాజధానిలో సుదీర్ఘ ప్రయాణం కారణంగా భోజన సర్వీస్ సాధారణంగా ఉంటుంది. అయితే రెండు రైళ్లలోనూ మెనూ, క్యాటరింగ్ విధానం మార్గాన్ని బట్టి మారుతుంది.

సౌకర్యాల్లో ఏది ముందుంది?

వందే భారత్ కొత్త తరం రైలు కావడంతో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సీట్లు, ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆధునిక ఇంటీరియర్ కూడా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. రాజధాని పాత సర్వీస్ అయినప్పటికీ, కొత్త కోచ్‌లు, అప్‌గ్రేడెడ్ వేరియంట్లలో ఆధునిక భద్రత, సౌకర్యాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

Read Also: రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

Tags

Related News

బ్రిక్స్ కోసం ఢిల్లీకి భారీ భద్రత.. రోడ్లే కాదు, ఎయిర్ స్పేస్ పైనా పరిమితులు!

ఆరేళ్ల తర్వాత భారత్‌కు చైనా విమానాలు.. సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ–ఢిల్లీ సర్వీసులు షురూ!

చాక్లెట్ పిరమిడ్లు.. మ్యాట్రియోష్కా బొమ్మలు.. బ్రిక్స్ అతిథులకు ఢిల్లీ హోటళ్లలో రాయల్ ట్రీట్!

పుతిన్ ‘రష్యా వన్’ vs జిన్‌పింగ్ బోయింగ్ 747.. ఎవరి విమానం ఖరీదైనదో తెలుసా?

జాబ్ వెతకడానికి ఇకపై నేరుగా దుబాయ్ వెళ్లిపోవచ్చు.. కొత్త వీసా ఇదిగో.. స్పాన్సర్ అవసరం లేదు

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

Big Stories

Advertisement
×