E-Paper
Advertisement

భారత్‌ లో లాంగెస్ట్, షార్టెస్ట్ హైవేలు ఇవే.. పొడవు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

భారత్‌ లో లాంగెస్ట్, షార్టెస్ట్ హైవేలు ఇవే.. పొడవు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Longest And Shortest National Highways in India: భారతీయ రవాణాలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో కలపడంతో పాటు, రాష్ట్రాల మధ్య సరుకు రవాణా, ప్రయాణాలు వేగంగా సాగేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉత్తరాన ఉన్న కశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, పశ్చిమాన గుజరాత్‌ నుంచి తూర్పున అస్సాం వరకు జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. అయితే, అన్ని జాతీయ రహదారులు ఒకే స్థాయిలో పొడవుగా ఉండవు. కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటే.. మరికొన్ని కేవలం కొన్ని కిలోమీటర్ల దూరానికే పరిమితమవుతాయి.

దేశంలోనే పొడవైన NH 44

భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారిగా NH 44 గుర్తింపు పొందింది. దీని పొడవు సుమారు 4,112 కిలోమీటర్లు. ఇది దేశ ఉత్తర భాగంలోని శ్రీనగర్‌ నుంచి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు విస్తరించింది. ఈ రహదారి అనేక రాష్ట్రాలను దాటుతూ దేశంలోని ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలను కలుపుతుంది.

NH 27.. పశ్చిమం నుంచి ఈశాన్యానికి!

Advertisement

పొడవులో రెండో స్థానంలో ఉన్న జాతీయ రహదారి NH 27. ఇది సుమారు 3,507 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నుంచి అస్సాంలోని సిల్చార్‌ వరకు ఈ రహదారి సాగుతుంది. దేశ పశ్చిమ భాగాన్ని ఈశాన్య ప్రాంతంతో కలిపే ప్రధాన రహదారి మార్గాల్లో ఇది ఒకటి. వ్యాపారం, సరుకు రవాణా, అంతర్రాష్ట్ర ప్రయాణాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

NH 48, NH 52, NH 30 కూడా భారీ రహదారులే!

NH 48 సుమారు 2,807 కిలోమీటర్ల పొడవుతో ఢిల్లీ నుంచి చెన్నై వరకు విస్తరించింది. దేశంలోని ముఖ్యమైన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గం సాగుతుంది.  NH 52 సుమారు 2,317 కిలోమీటర్ల పొడవుతో పంజాబ్‌లోని సంగ్రూర్‌ నుంచి కర్ణాటకలోని అంకోలా వరకు వెళ్తుంది. ఇక NH 30 దాదాపు 2,040 కిలోమీటర్ల పొడవు కలిగి, ఉత్తరాఖండ్‌లోని సీతార్‌గంజ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం వరకు కలుపుతుంది.

అతి చిన్న జాతీయ రహదారి ఏది?

Advertisement

పొడవైన రహదారులకు పూర్తి భిన్నంగా కొన్ని జాతీయ రహదారులు చాలా చిన్న దూరానికే పరిమితమయ్యాయి. వీటిలో NH 548 పేరు తరచుగా వినిపిస్తుంది. మహారాష్ట్రలోని కలంబోలి ప్రాంతంలో ఉన్న ఈ రహదారి సుమారు 5 కిలోమీటర్ల పొడవు మాత్రమే కలిగి ఉందని అందుబాటులో ఉంది. అదే విధంగా NH 118, అలాగే NH 766EE లాంటి కొన్ని జాతీయ రహదారులు కూడా తక్కువ పొడవుతో ఉన్నాయి. వీటి పరిధి కొన్ని ప్రాంతాలు, నిర్దిష్ట మార్గాలను అనుసంధానించడానికే పరిమితం అవుతుంది. జాతీయ రహదారి అంటే తప్పనిసరిగా వేల కిలోమీటర్లు ఉండాల్సిన అవసరం లేదని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాంతాలను అనుసంధానించడం, రవాణా అవసరాలను తీర్చడం అనే లక్ష్యంతో ఒక్కో రహదారికి ఒక్కో ప్రత్యేక ఉంది.

Read Also: ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

Tags

Related News

నల్లగొండలో యాక్సిడెంట్లకు చెక్.. నాలుగు లైన్లుగా సాగర్ రోడ్డు విస్తరణ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!

రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు.. 46 మంది మృత్యువాత!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మెట్రోకు కొత్త లింక్ ప్లాన్!

40 రోజులు స్నానం చేయకుండా మహిళల వేషాలు వేసే పురుషులు.. ఈ వేడుక ఎక్కడ జరుగుతుందంటే?

రజనీకాంత్ ‘జైలర్ 2‘ షూటింగ్ లొకేషన్స్ ఇవే.. ట్రావెల్ లవర్స్‌ కు వెరీ స్పెషల్!

Big Stories

Advertisement
×