E-Paper
Advertisement

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Nampally Railway Station: రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 2027 నాటికి పూర్తి- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Advertisement

Nampally Railway Station: 2027 నాటికి హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.327 కోట్లు కేటాయించిందన్నారు. దీనిని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

అత్యాధునిక సౌకర్యాలు

2027 చివరి నాటికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఇకపై పనులపై క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నాంపల్లి రైల్వే స్టేషన్‌ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Also Read: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్

రూ.48 వేల కోట్ల పనులు

నాంపల్లి రైల్వే స్టేషన్ రీమోడలింగ్ లో భాగంగా, రెస్టారెంట్లు, స్టాళ్లు, మెరుగైన సౌకర్యాలతో సెంట్రల్ హాల్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకని వై-ఫై కనెక్టివిటీ, సీసీటీవీ కెమెరాలు, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,450 కోట్లకు పైగా కేటాయించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా దాదాపు రూ.48,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని చెప్పారు.

Related News

మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్‌ తో ఈజీగా తెలుసుకోవచ్చు!

ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్ డేట్ ఫిక్స్.. ఇక హైస్పీడ్ జర్నీకి రెడీ!

ఐఫోన్ 18 డ్యూయోనా? యూరప్ ట్రిప్పా? రూ.4.5 లక్షలతో ఈ దేశాలు హ్యాపీగా చుట్టేయొచ్చు!

ఢిల్లీలో రైళ్లకు బ్రేక్.. ఏకంగా 110 సర్వీసులపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే?

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×