E-Paper
Advertisement

మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!

మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!
Advertisement

Pan Am Flight 914 Mystery: పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర వేస్. ఈ సంస్థ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1927లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఒకానొక సమయంలో  అమెరికాలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్‌ లైన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఈ సంస్థకు సంబంధించిన ఓ వింత కథ ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 914’ మిస్టరీ.

ఇంతకీ ఏంటీ ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 914’ మిస్టరీ?

1955 జూలై 2న ఈ సంస్థకు చెందిన పాన్ ఆమ్ 914 ఫ్లైట్ న్యూయార్క్ నుంచి మయామికి బయల్దేరింది. విమానంలో నలుగురు సిబ్బందితో పాటు 57 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణం కూడా బాగానే ఉండటంతో ప్రయాణం సజావుగా సాగుతుందని అందరూ భావించారు. కానీ, విమానం బయల్దేరిన కొద్ది సేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైపోయింది. అధికారులు ఎంత వెతికినా జాడ దొరకలేదు. చివరికి అది సముద్రంలో కూలిపోయిందని భావించి కేసును క్లోజ్ చేశారు.

37 సంవత్సరాల తర్వాత ల్యాండింగ్

Advertisement

కానీ, కథ అక్కడితో ముగియలేదు. ఈ ఘటన జరిగిన సుమారు 37 సంవత్సరాల తర్వాత, అంటే 1992లో, వెనిజులాలోని కారకాస్ విమానాశ్రయంలో ఓ అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా రాడార్‌ పై ఒక పాత మోడల్ DC-4 విమానం కనిపించింది. అంతేకాదు, ఆ విమానం అక్కడ ల్యాండ్ అయిన తర్వాత, పైలట్ ట్రాఫిక్ కంట్రోల్‌ ను  మనం ఎక్కడ ఉన్నామని  అడిగాడట. ఇది విన్న అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ పైలెట్ తనను పాన్ ఆమ్ 914 పైలట్‌ గా పరిచయం చేసుకున్నారట. కానీ, అధికారులు అతడికి ఇది 1992 సంవత్సరం అని చెప్పగానే, పైలట్ ఒక్కసారిగా భయపడి, వెంటనే విమానాన్ని మళ్లీ టేకాప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని అంటారు.

37 ఏళ్ల తర్వాత కూడా ఏజ్ లో నో ఛేంజ్

ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏంటంటే? ఆ విమానంలోని ప్రయాణికులు ఎవరూ వృద్ధులుగా కనిపించలేదట. అంటే   1955లో ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నారని ఆ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. అయితే, వారి కుటుంబ సభ్యులు మాత్రం సంవత్సరాల తర్వాత పెద్దవారయ్యారు. ఈ విషయం విన్న చాలా మంది టైమ్ ట్రావెల్ నిజమా? అని ఆనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ కథకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. విమానయాన చరిత్రలో కూడా పాన్ ఆమ్ 914 ఫ్లైట్ నిజంగా ఉన్నట్టు రికార్డులు కూడా లేవు. ప్రజల్లో ప్రచారం పొందిన ఒక కల్పిత కథగానే చాలా మంది భావిస్తున్నారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 914 కథ నిజమా? కాదా?  అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ,  విమానయాన రంగంలో వినిపించే అత్యంత వింత కథలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.

Advertisement

Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్‌ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×