E-Paper
Advertisement

Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అడుగడుగునా లంచాల దందా.. రాబంధుల్లా పీక్కుతింటున్న సిబ్బంది..!

Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అడుగడుగునా లంచాల దందా.. రాబంధుల్లా పీక్కుతింటున్న సిబ్బంది..!
Advertisement

Gandhi Hospital: మీరు వింటున్నది అక్షరాలా నిజం. పేదవాడి పెద్ద దవాఖానా ఇప్పుడు మామూళ్ల ఖజానాగా మారింది. అవును సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో అడుగడుగునా లంచాల దందా నడుస్తోంది. గేటు దగ్గరి నుంచే వసూళ్లు మొదలవుతున్నాయి. అసలు గాంధీలో ఏం జరుగుతోంది? ఒక నిరుపేద కుటుంబం ప్రాణాలరచేతిలో పెట్టుకుని హాస్పిటల్ గేటు దాటితే సెక్యూరిటీ దగ్గర నుంచి వార్డ్ బాయ్స్ దాకా ప్రతి ఒక్కరి చేయి తడపాల్సిందే! పేషెంట్‌ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లాలా? 5 వందలు తీయ్ వీల్‌చైర్ కావాలా? వంద నోటు జేబులో పెట్టాల్సిందే. కనీసం ప్రాణాపాయంలో ఉన్న తమ వారిని ఐసీయూలోనో, వార్డులోనో చూసి వస్తామన్నా సరే.. అక్కడ గేటు దగ్గర ఉన్న సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకుంటేనే లోపలికి పంపిస్తున్నారు.

ఒక్కో రేటుతో..

రైట్ ఇక అంబులెన్స్ కావాలంటే ఆ దోపిడీ నెక్స్ట్ లెవెల్ అనుకో. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా అందాల్సిన సేవలు ఇక్కడ ఒక్కో అడుగుకీ ఒక్కో రేటుతో ముడిపడి ఉన్నాయి. పేదవాడి రక్తాన్ని పిండి, వాళ్ల జేబులు ఖాళీ చేస్తున్న ఈ నెట్‌వర్క్ వెనక ఉన్నదెవరు? ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతోందా? లేక వాళ్లకు కూడా ఇందులో వాటాలు అందుతున్నాయా?అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.

మందుల కొరత..

Advertisement

జనరల్ వార్డుకు వెళ్లడానికి మనకు సంబంధించిన రోగులు ఉండాలి. దీనికి అనుమతి స్లిప్ ఉండాలి. బట్ ఇక్కడ 100 రూపాయాలు ఇస్తే చాలు అన్ని రూల్స్ బ్రేక్ అయిపోతాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలతో మందులు కొనుగోలు చేసి పేదలకు అందిస్తుంటే ఆసుపత్రిలో మాత్రం మందుల కొరత ఉందని చెబుతున్నారు. వారు బయటకు వెళ్లి ప్రైవేటు మెడికల్ షాపులో కొనుగోలు కొనుక్కోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆసుపత్రిలో రోగులు వెళ్లాలంటే ఖచ్చితంగా వీలు చైర్ ఉండాల్సిందే. అందుకే ప్రభుత్వం ఆసుపత్రి వద్ద వీల్ చైర్‌లను, సిబ్బందిని ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ మాత్రం వీల్ చైర్ కదలాలంటే డబ్బులు కొట్టాల్సిందే. అప్పటి వరకు పేషంట్.. వారి అటెండర్లు పడిగాపులు పడాల్సిందే.

Also read: గద్వాల్ జిల్లాలో దారుణం.. ప్రారంభానికి ముందే బీటలు వారిన కొత్త హాస్పిటల్..!

7 వేల రూపాయలు..

Advertisement

గాంధీలో అంబులెన్స్ ఉన్నా అవి పనిచేయవు. ఎందుకంటే అక్కడ ప్రైవేటు అంబులెన్స్ బిజినెస్ జరగాలి. ఇదో ఇంటర్నల్ డీల్. ఒక ట్రిప్పుకు ఫోన్ పే చేసే వరకు ప్రైవేటు వాళ్లు డెడ్ బాడీని ముట్టుకోరు. ఇలా 7 వేల రూపాయలు ఇస్తే తప్ప కుదరదని చనిపోయిన వారి బంధువులును రాబంధుల్లా పీక్కుతుంటున్న సీన్స్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మందులు లేవంటారు.. దానితో పాటు మిషన్లు పనిచేయదంటారు. అది ఎక్స్ రే అయినా అంతే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రోగి ఇంత వయస్సులో రెండు రోజుల నుంచి తిరుగుతున్నా… కనీసం పట్టించుకున్న వారు లేరని వాపోతున్నాడు. చివరికి ఓపీ అవుట్ పేషంట్‌ వార్డులో డాక్టర్‌ని కలవాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇదిగో ఇలా డబ్బులు ఇచ్చి ఓపీ రాయించుకుంటున్న రోగులు కనిపిస్తారు.

ఏదో వచ్చామా? వెళ్లామా?

హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారూ.. చూస్తున్నారా మీ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి బాగోతం. రాబంధుల్లా రోగులను, బంధువులను పీక్కు తింటున్న సీన్లు. మళ్లీ మళ్లీ చూడండి. సూపరింటెండెంట్ హోదాలో ఏదో వచ్చామా? వెళ్లామా? అన్నట్లు ఉంటే ఎట్లా మేడం? రోగులకు జరుగుతున్న ట్రీట్మెంట్.. వాళ్ల లంచగొండితనానికి బలవుతున్న పరిస్థితులపై ఇప్పటికైనా రియాక్ట్ అవుతారా..? లేకుంటే లైట్ తీసుకుంటారా? అన్నది మీ చేతుల్లోనే ఉంది.

Storey By: Appa Rao big Tv

Also read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!

Related News

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

దానం నాగేందర్‌కు ఉహించని షాక్.. రివేంజ్ తీర్చుకునేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్!

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

Big Stories

Advertisement
×