E-Paper
Advertisement

రైతు సంక్షేమంపై స‌ర్కార్ తీన్మార్‌! బీఆరెస్ ఆరోప‌ణ‌ల‌పై ఈంట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. !

రైతు సంక్షేమంపై స‌ర్కార్ తీన్మార్‌! బీఆరెస్ ఆరోప‌ణ‌ల‌పై ఈంట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. !
Advertisement

రెండున్న‌రేండ్ల పాల‌న‌లో రైతుల‌కేమి చేశామో జ‌నానికి వివ‌రించే క్ర‌మంలో స‌ర్కార్ స‌క్సెస‌య్యింది. వ‌రుస‌గా ముగ్గురు.. ఒక్కొక్క‌రు ఒక్కో విధానం, వివ‌ర‌ణ‌. ఎవ‌రికి వారే లోతైన స‌మాచారం… ప్ర‌చారాల‌ను తిప్పికొట్టే విధంగా ఖుల్లం ఖుల్లా వివ‌రాలు..!

వ‌రుస‌బెట్టి చెప్పిన విధానంతో చాలా మందిలో నెల‌కొని ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫ‌లించింది. మొద‌ట డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆ త‌రువాత వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, తీన్మార్‌లో చివ‌ర‌గా సీఎం రేవంత్‌రెడ్డి.. వ‌రుస‌బెట్టి వివ‌రించిన వైనం… గ‌ణాంకాలతో తెలంగాణ స‌మాజం ముందు ఉంచిన తీరు.. బాగా క‌నెక్ట‌య్యింది.

Advertisement

అర‌టి పండు ఒలిచి నోట్లో పెట్టిన‌ట్టుగా రైతుల కోసం ప‌దేళ్ల పాల‌న‌లో ఏం చేశారు? ఈ రెండున్న‌రేండ్ల‌లో కాంగ్రెస్ స‌ర్కార్ ఏం చేసింది? అనే విష‌యాల‌పై చాలా స్ప‌ష్ట‌త వ‌చ్చింది ఈ మీటింగు ద్వారా. రైతు బీమా ప్రీమియం చెల్లించ‌లేద‌ని గ‌గ్గోలు పెట్టారు. కానీ ఆ ప్రీమియం మొత్తంఎంత చెల్లించారో లెక్క‌ల‌తో సహా వివ‌రించారు తుమ్మ‌ల‌.

రైతుల కోసం మొత్తం ప‌దేళ‌ల్లో కేసీఆర్ చేసిన ఖ‌ర్చెంత‌..? అది నెల‌కు ఎంత‌..? ఏడాదికి ఎంత‌..? అని విపులంగా లెక్క‌లు తీశాడు భ‌ట్టి.. అప్పుడు పెట్టిన ఖ‌ర్చుకు.. దాదాపుగా రెట్టింపు ఖ‌ర్చు కాంగ్రెస్ స‌ర్కార్ చేసింద‌ని గ‌ణాంకాల‌తో వివ‌రించ‌డం బాగుంది. ఇది ఒక చ‌ర్చ‌కు చాన్స్ ఇచ్చింది. రేపు బీఆరెస్ ఈ లెక్క‌ల‌నై వాద‌న‌లు చేసినా.. చ‌ర్చ అర్థ‌వంత‌గా సాగుతుంది.

Advertisement

జ‌నాల‌కు కూడా క‌రెక్టుగా ఎవ‌రేమి చేశారో అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు.. బీఆరెస్ క‌న్నా డ‌బుల్ ఖ‌ర్చు పెడుతున్న‌ది వివ‌రిస్తూనే.. అదీ కేసీఆర్ చేసిన అప్పులు, మిత్తీల కింద‌.. ఏడాదికి రెండు ల‌క్ష‌ల కోట్ల పై చిలుకు మొత్తం చెల్లిస్తూ.. అని వివ‌రించ‌డం రైతుల‌కు బాగా క‌నెక్ట‌య్యింది. దీంతో పాటు.. వాళ్లు పెట్టిన ఖ‌ర్చు ప‌దేళ్ల‌కు. ఇప్పుడు స‌ర్కార్ చేసిన ఖ‌ర్చు లెక్క‌లు రెండున్న‌రేండ్ల‌వి. అంటే స‌గం ట‌ర్మ్‌లోనే డ‌బుల్ ఖ‌ర్చు చేశామ‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు.. అంద‌రికీ అర్థ‌మ‌య్యేట‌ట్టు వివ‌రించారు భ‌ట్టి.

ఇక తుమ్మ‌ల కూడా వాస్త‌వాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు. ఓ సీజ‌న్ రైతు భ‌రోసా వేయ‌లేక‌పోయామ‌ని రైతుల‌కు ప‌రిస్థితి వివ‌రించి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. స‌బ్జెక్టు ప‌రంగా తుమ్మ‌ల‌, భ‌ట్టి గ‌ణాంకాల‌తో.. ఎలాంటి చ‌ర్చ‌కైనా సిద్ద‌మేన‌న్న‌ట్టుగా, బీఆరెస్‌కు స‌వాల్ విసురుతున్న‌ట్టుగా మాట్లాడారు. ఇది ఒక ర‌కంగా త‌మ వంతు చ‌ర్చ ఇద‌ని.. ఇక మీరు రండి మీ లెక్క‌ల‌తో చూసుకుందాం..!అన్న‌ట్టుగానే సాగింది.

ఇక దీనికి ముగింపుగా తీన్మార్ ద‌రువు వేశారు సీఎం రేవంత్‌. మొత్తానికి ఈ ముగ్గురు సంద‌ర్బోచితంగా, సబ్జెక్టుతో కొట్టిన దెబ్బ‌కు బీఆరెస్‌కు దిమ్మ‌దిరిగింద‌నే చెప్పాలి. ఈ తీన్మార్ వ్యూహం ఫ‌లించింది. రైతుల వ‌ద్ద మంచి మార్కులు ప‌డ్డాయి. ప్ర‌తిప‌క్షాల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్మాయి.

Related News

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!

Big Stories

Advertisement
×