Shardul Thakur: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ ( Captain Shubman Gill ) అలాగే గౌతమ్ గంభీర్ పై (Coach Gautam Gambhir) ఆల్రౌండర్ షార్దూల్ ఠాకూర్ ( Shardul Thakur) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కలిసి తన కెరీర్ నాశనం చేశారని, ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ( IND vs ENG Test Series) తనను సరిగ్గా వాడుకోలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఆల్రౌండర్ పాత్రలో తనను బీసీసీఐ (BCCI) సెలెక్ట్ చేసినప్పటికీ.. తన పట్ల కుట్రపూరితంగా గిల్ అలాగే గంభీర్ వ్యవహరించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియాలో తనకు సరిగ్గా అవకాశాలు రావడంలేదని మండిపడ్డారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో శార్దూల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్, గిల్ లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 2025 లో టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రెండు జట్ల మధ్య మొత్తం ఐదు టెస్టులు జరిగాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్ సందర్భంగా శుభ మాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీ లోనే ఇంగ్లాండులో పర్యటించింది టీమిండియా. ఈ క్రమంలో ఈ టెస్టు సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో తనను సరిగ్గా వాడుకోలేదని గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ మాన్ గిల్ వై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్. 2025 లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన పట్ల కుట్రపూరితంగా వ్యవహరించాలని మండిపడ్డారు. ఈ సిరీస్ లో తనకు సరిగ్గా బౌలింగ్ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. బౌలింగ్ రొటేషన్ లో వ్యూహాత్మక లోపాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునేవాడినని చెప్పుకొచ్చారు. లీడ్స్ వేదికగా జరిగిన టెస్ట్ లో చెత్తగా బ్యాటింగ్ చేసి తాను ఔట్ అయ్యానని గుర్తు చేశారు. అందులో తప్పు తనదే.. ఒప్పుకుంటానన్నారు. కానీ మాంచెస్టర్ వేదికగా తాను అద్భుతంగా బ్యాటింగ్ చేశానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తనకు తక్కువ ఓవర్లు ఇచ్చి బౌలింగ్ చేయమన్నారని మండిపడ్డారు. తనను సరిగ్గా వాడుకుని ఉంటే… మంచి ఫలితాలు వచ్చేవన్నారు. సరైన సమయంలో తనకు బౌలింగ్ ఇచ్చి ఉంటే తన వ్యాల్యూ కచ్చితంగా తెలిసేదన్నారు. కానీ తన కెరీర్ నాశనం చేసేలా ఈ ఇద్దరు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎవరిని ఎక్కడ వాడుకోవాలి ? ఏ సమయంలో బౌలింగ్ ఎవరితో చేయించాలనే అవగాహన గిల్, గంభీర్ కు తెలియదని ఆరోపణలు చేశారు. దీంతో శార్దూల్ చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి.