E-Paper
Advertisement

ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?

ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?
Advertisement

Europe Heatwave: యూరోప్‌ కంట్రీస్‌ అంటే కూల్‌ వెదర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే ప్రస్తుతం అక్కడ సిట్చ్యూవేషన్‌ రివర్స్‌ అయింది. బాబోయ్‌.. ఎండలంటూ ఆమడదూరం పరిగెడుతున్నారు అక్కడి జనాలు. ఇప్పటివరకు కూల్‌గా ఉన్న వెదర్‌ ఒక్కసారిగా మారిపోవడంతో జనం బెంబెలెత్తుతున్నారు. యూరోప్‌లో సగటు ఉష్ణోగ్రత కంటే టెంపరేచర్‌ భారీగా పెరగడంతో ప్రజలు తిప్పలు తప్పడం లేదు. దీనికి తోడు ఎడారి ప్రాంతం నుంచి వచ్చే హీట్‌వేవ్‌ కూడా తోడవ్వడంతో ప్రజలు మాడిపోతున్నారు.

ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..

భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు నీటి కాలువలు, నదుల్లోకి దిగుతున్నారు అక్కడి ప్రజలు. ఇలా అజాగ్రత్తగా కాలువల్లోకి దిగి ఇప్పటివరకు 40మందికి పైగా మృతి చెందారు. ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. 31 ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఫ్రాన్స్‌లో హీట్‌వేవ్‌ దెబ్బకు స్కూల్స్‌కు హాలీడే ఇచ్చారు. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడిగాలులు రావడంతో ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నెదర్లాండ్‌లో కూడా పలు ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. మరికొన్ని రోజులు యూరోప్‌లో ఇదే పరిస్థితి కొనసాగే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement

Also read: Water Wastage: ఇదో విచిత్రమైన ఘోరం.. ట్యాంక్ నిండా నీరు ఉన్నా.. ఊరికి మాత్రం కరువు..!

పలు దేశాలు హెచ్చరికలు

ఫ్రాన్స్‌ మాత్రమే కాదు.. స్పెయిన్‌, ఇటలీ దేశాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పశ్చిమ బ్రిటన్‌లోని పలు ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అటవీ ప్రాంతాల్లో కార్చిర్చు మొదలవుతుందనే భయం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే మైనే-ఎట్‌-లోయర్‌ ప్రాంతంలో చెలరేగిన కార్చిర్చును ఫైర్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజలంతా అత్యవసరం ఉంటే తప్పా బయటకు రావద్దని ఇప్పటికే పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.

వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం..

Advertisement

యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌, స్విట్జర్లాండ్, జర్మనీలో రెడ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి. తీవ్ర వేడిగాలులు, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఈయూ దేశాలు ప్రకటించాయి. ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం యూరోప్ దేశాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కంటే రెండింతల వేడి నమోదవుతోంది. రాబోయే రోజుల్లో యూరోప్‌ దేశాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. 1947 తర్వాత ఫ్రాన్స్‌లో అత్యంత వేడిగాలులు ఇప్పుడే వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తోంది.

Also Read: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Related News

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

Big Stories

Advertisement
×