E-Paper
Advertisement

ఆపిల్ వాచ్‌లాగే ఉంది కదూ ! తక్కువ ధరలో Huawei Watch Fit 4..ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారంతే

ఆపిల్ వాచ్‌లాగే ఉంది కదూ ! తక్కువ ధరలో Huawei Watch Fit 4..ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారంతే
Advertisement

Huawei Watch Fit 4: ప్రస్తుతం స్మార్ట్ వాచ్ మార్కెట్లో రెక్టాంగ్యులర్ (చతురస్రాకార) డిజైన్ ఉన్న వాచ్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఆపిల్ వాచ్ వంటి ప్రీమియం లుక్ కోరుకునే వారికి Huawei Watch Fit 4 చక్కని ప్రత్యామ్నాయం. కేవలం లుక్ మాత్రమే కాదు.. హెల్త్ ట్రాకింగ్, బ్యాటరీ విషయంలోనూ.. ఇది అదరహో అనిపిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ ఆన్‌లైన్‌లో.. తక్కువ ధరకు లభిస్తోంది. దీని లోని లేటెస్ట్ ఫీచర్లు, ఆన్‌లైన్ ధర వివరాలను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

టెక్నాలజీ దిగ్గజం హువావే తన ‘వాచ్ ఫిట్’ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన Watch Fit 4 ప్రస్తుతం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫిట్‌నెస్‌తో పాటు ఫ్యాషన్‌ను కూడా కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ గాడ్జెట్.

Huawei Watch Fit 4 ఫీచర్లు:

Advertisement

డిజైన్, డిస్‌ప్లే:
Huawei Watch Fit 4 ప్రధాన ఆకర్షణ దీని 1.82-అంగుళాల అమోలెడ్ స్క్రీన్. ఇది 480 × 408 పిక్సెల్స్ రిజల్యూషన్ , 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అంటే మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని బాడీ అల్యూమినియం అల్లాయ్‌తో తయారై.. కేవలం 26 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కాబట్టి రోజంతా పెట్టుకున్నా అస్సలు ఇబ్బందిగా అనిపించదు.

హెల్త్ ట్రాకింగ్:
ఈ వాచ్‌లో హువావే తన లేటెస్ట్ సెన్సార్లను వాడింది.

Advertisement

Heart Rate & SpO2: గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను ఇది ట్రాక్ చేస్తుంది.

ఎమోషనల్ అసిస్టెంట్: ఇది ఒక సరి కొత్త ఫీచర్. మీ ఒత్తిడి, మూడ్‌ను బట్టి మీకు.. రిలాక్సేషన్ కోసం సూచనలు ఇస్తుంది.

100+ స్పోర్ట్స్ మోడ్స్: మీరు రన్నింగ్ చేసినా, సైక్లింగ్ చేసినా లేదా స్విమ్మింగ్ చేసినా.. మీ ప్రతి కదలికను ఇది రికార్డ్ చేస్తుంది. ఇందులో బిల్ట్ఇన్ జీపీఎస్ ఉండటం వల్ల ఫోన్ లేకుండానే మీ రన్నింగ్ రూట్‌ను ట్రాక్ చేయవచ్చు.

బ్యాటరీ, ఛార్జింగ్:
స్మార్ట్ వాచ్‌లలో బ్యాటరీ అనేది అతిపెద్ద సమస్య. కానీ Huawei Watch Fit 4.. 10 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. ఒకవేళ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (AOD) వాడితే 4 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఒక రోజంతా వాడుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Also Read: ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సూపర్.. Mi Band 6 ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ధర :
ప్రస్తుతం Huawei Watch Fit 4 ధర సుమారు రూ.12,999 గా ఉంది. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో బ్యాంక్ ఆఫర్లు , ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలిపితే.. ఇది ఇంకా తక్కువకే (సుమారు రూ.11,999) లభించే అవకాశం ఉంది. సిల్వర్, బ్లాక్, పింక్ , గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్, జీపీఎస్ , ప్రీమియం అమోలెడ్ డిస్‌ప్లే ఉన్న వాచ్ కావాలనుకునే వారికి Huawei Watch Fit 4 ఒక బెస్ట్ ఆప్షన్. ఇది ఆండ్రాయిడ్ , ఐఫోన్ (iOS) రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.

Related News

ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!

డేటా సేఫ్టీ అలర్ట్..ఈ పర్మిషన్స్ ఇస్తే మీ ఫోన్ హ్యాక్ కావడం ఖాయం!

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే.. ఈ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే!

యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ సీక్రెట్స్..వీడియో అప్‌లోడ్ చేసేముందు ఇవి తెలుసుకోండి!

ల్యాప్ టాప్‌లో స్క్రీన్ షాట్ తీయడం ఎలా? ఈ 5 ఈజీ షార్ట్‌కట్స్ మీకు తెలుసా?

రూ.1799కే 54 గంటల బ్యాటరీనా? మ్యూజిక్ లవర్స్‌ని ఊపేస్తున్న మోడల్!

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

Big Stories

Advertisement
×