Illegal Sand: ఇది బిగ్ టీవీ ఎఫెక్ట్. కార్మిక మంత్రి సుభాష్ నియోజకవర్గంలో జరుగుతోన్న ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాలన్న దృఢ సంకల్పం- మంచి ఫలితాలను ఇచ్చింది. బిగ్ టీవీ ఎంతో ధైర్యంగా ఆ ఇసుక రీచ్ లకు వెళ్లి చేసిన సాహసోపేతమైన ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఇందుకు అధికారుల స్పందన ఎలాంటిది? లెట్స్ వాచ్ దిస్ షార్ట్ స్టోరీ. ఈ మైనింగ్ సూపరింటెండెంట్ ఏమంటున్నారో విన్నారా? రామచంద్రాపురం నియోజకవర్గంలోని ఆరు రీచ్ లలో తప్ప మరెక్కడా ఇసుక తవ్వకాలు జరగరాదు, అమ్మరాదు, కొనరాదని అంటున్నారు గమనించారా? ఒక వేళ అదే జరిగితే ఇల్లీగల్ అవుతుందని అంటున్నారు స్పష్టంగా విన్నారా..
ఎస్. ఎగ్జాట్ గా ఇదే పాయింట్ మీద ఫైట్ చేసింది బిగ్ టీవీ. ఎంతో డేరింగ్ అండ్ డ్యాషింగా రామచంద్రాపురం నియోజకెవర్గంలోని రామఘట్టం, స్పాట్ కి వెళ్లింది. టీం బిగ్ టీవీ రాకను చూసి మొబైల్ షూట్ చేశారక్కడి సిబ్బంది. ఇక్కడ దారుణమైన విషయమేంటంటే. రామచంద్రాపురం నిజోజకవర్గంలో రామఘట్టంలో అనుమతుల్లేకుండా ఇసుక తవ్వడం మాత్రమే కాదు. నదీ గర్భాన్ని కూడా యధేచ్చగా తవ్వేయడం. ఈ విషయాలను గుర్తించి తన కెమెరా కన్ను గురి పెట్టింది బిగ్ టీవీ.
గమనించారా? ఇది నిబంధనలకు విరుద్ధం. ఇలా గోదావరి గుండెల్ని తవ్వేసే కార్యక్రమాలు చేపట్టకూడదు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకురావడంలో భాగంగా గోదావరి నదీ గర్భం సైతం తవ్వేస్తున్న దృశ్యాలను చిత్రించింది బిగ్ టీవీ. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో..రోజూ 150 లారీల మేర దోపిడీ చేసేది ఇసుక మాఫియా. ఇక్కడే రీచ్ లలో ఆఫీసులు తెరిచి.. ఒక్కో లారీ నుంచి 6500 రూపాయలను వసూలు చేసింది. ఈ మొత్తం విలువ ఒక రోజుకు 10 లక్షల రూపాయలు.
ఒక రోజుకు పది లక్షలు అంటే, ఆ మొత్తం నెలకు- సుమారు 3 కోట్ల రూపాయలు. ఇందులో ఎవరి వాటాలు వారికి చేరిపోతాయని అంటారు ఇక్కడి వారు. ఇందులో మంత్రి సమీప బంధువు ఇన్వాల్వ్ అయ్యారని కూడా చెబుతారు. ఇక ఈ జేసీబీ డ్రైవర్ ది మరో కథ. ఇతడైతే తెలీదు- గుర్తులేదు- మరచిపోయా బాపతు. ఇక కొందరైతే తాము చేపల వేటకు వచ్చామని చెప్పి తప్పించుకునే యత్నం చేయడం గమనించింది బిగ్ టీవీ. నిజాన్ని నిర్భయంగా నిష్పక్షపాతంగా చెప్పడంలో ఎప్పుడూ ముందుండే బిగ్ టీవీ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అంటూ ఇసుక రీచ్ లోకి దూసుకెళ్లి చేసిన ఈ సాహసోపేత యత్నానికి రియాక్షన్ వచ్చింది. బిగ్ టీవీ కథనానికి స్పందించారు మైనింగ్ అధికారులు.
రామఘట్టంలో అనుమతుల్లేకుండా నడుస్తోన్న ఇసుక ర్యాంప్ ను సీజ్ చేశారు మైనింగ్ అధికారులు. ఇక్కడి ఇసుక డంప్ లను మూసేశారు. ఒక డ్రెడ్జింగ్ బోట్ తో పాటు పైపులను కూడా సీజ్ చేశారు అధికారులు. గోదావరిలో సీజ్ చేసిన యంత్రాలను తదుపరి చర్యల కోసం ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కి అప్పగించారు. తమ రాకను గమనించిన ఇసుక మాఫియా యంత్రాలను గట్టుపైనే వదిలి పరారైనట్టు చెప్పారు అధికారులు. కోట, రామఘట్టం ప్రాంతాల్లో ఇప్పటి వరకూ జరిపిన తవ్వకాలను కొలతలు వేసి మరీ- జరిమానా విధిస్తామని అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై నిఘా ఉంచుతామని కూడా చెప్పారు జిల్లా మైనింగ్ అధికారులు.
Also read: Ayodhya: అయోధ్య రాముడి విరాళాల కేసులో సంచలనం.. కేసులో షాకింగ్ ట్విస్ట్‌లు!