E-Paper
Advertisement

ఏపీ రాజకీయాల్లో పెను విషాదం.. ముద్రగడ పద్మనాభం కన్నుమూత

ఏపీ రాజకీయాల్లో పెను విషాదం.. ముద్రగడ పద్మనాభం కన్నుమూత
Advertisement

Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ముఖ్యంగా కాపు సామాజికవర్గ హక్కుల పోరాటాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద లోటును మిగిల్చింది.

ముద్రగడ  పద్మనాభం జననం..

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి( కాకినాడ) జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు.
మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమానపాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం పాలుకావడంతో నీలం వారి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డి జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో అతని తండ్రిని చూసుకున్నారు.

పిఠాపపురంలో ఓటమి..

Advertisement

ఆవిధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం రెడ్డి మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. 2009లో వై. ఎస్‌. ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్లీ ఓడిపోయారు. ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు సోదరులు, ‘కాపు ఉద్యమం’ను ముందుకు తీసుకుని వెళ్ళమని కోరిన మీదట, ఆయన ఉద్యమానికి సారథ్యం తీసుకున్నారు.

Also Read: హర్మూజ్ జలసంధిపై ట్రంప్ ‘ట్యాక్స్ బాంబ్’.. భారత్‌పై ప్రభావం ఎంత?

జిల్లా వ్యాప్తంగా కాపుల ఆందోళన..

1988లో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం రెడ్డి అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తరకంచి పోలీసులు అరెస్టు చేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం రెడ్డి స్టేషనుకు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషనలోకి రానివ్వలేదు. దాంతో స్టేషన్ ముందు బైఠాయించారు. టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనబడలేదు. 5వ రోజు సాయంత్రం ‘ఆమరణ దీక్ష’ ప్రకటించారు. దీనితో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తరకంచి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పోలీసులు అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేయించారు. ఆ సంఘటన తరువాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది.

1994లో పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో (జీవో నం. 30) జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చారు. తరువాత డివిజన్ బెంచి సమర్థించింది.

ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం..

2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి. కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చినవారిని రోడ్లు – రైళ్ల రోకోలకు పిలుపు ఇచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది

2024 ఎన్నికలలో పేరు మార్పు చాలెంజ్

2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరక్కపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు.అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందారు.సవాల్‌ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు.

Also Read: వైష్ణవి, జాహ్నవిల జాడ ఏది? కన్నవారి కన్నీటికి సమాధానం ఎక్కడ? పోలీసులు ఫెయిల్?

2024 లో వైసీపీలోకి ఎంట్రీ..

ముద్రగడ పద్మనాభరెడ్ది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కు చెందిన రాజకీయనాయకుడు. సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నారు . తరువాత 2024 సార్వత్రిక ఎన్నికలు సమయంలో 2024 మార్చి 16న వైసీపీలో చేరారు.

Related News

టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. సామాన్య భక్తులకు గుడ్ న్యూస్.. దాతల దర్శనాల్లో కీలక మార్పులు!

రెవెన్యూ బాధితులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు స్పెషల్ డ్రైవ్.. రంగంలోకి మంత్రి నారాయణ!

నీ బ్రతుకంతా అబద్ధాల పునాదే.. జగన్‌పై మంత్రి అచ్చన్నాయుడు ఫైర్!

బైకుతో గుద్దితే వ్యక్తి చనిపోయాడు.. ఆ 18 ఏళ్ల పిల్లోడికి ఏం తెలుసు: జగన్

ఏవో శ్రీహరి హత్య కేసు.. నిందితుడు హరికృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య

ఏపీ ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

మూడేళ్లు కళ్లు మూసుకుంటే మన ప్రభుత్వం.. ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తా.. జగన్ కీలక ప్రకటన

Big Stories

Advertisement
×