E-Paper
Advertisement

గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?

గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?
Advertisement

World’s Most Amazing Pink Lakes: ప్రపంచంలో చాలా సరస్సులు నీలం రంగులో లేదంటే ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. కొన్ని సరస్సులు అద్దంగా కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. అయితే, కొన్ని సరస్సులు మాత్రం గులాబీ రంగులో మెరిసిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఆ సరస్సులు ఏవి? అవి గులాబీ వర్ణంలో ఎందుకు కనిపిస్తున్నాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1.హిలియర్ సరస్సు: ఆస్ట్రేలియా

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ గులాబీ సరస్సుల్లో హిలియర్ సరస్సు ఒకటి. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న ఈ సరస్సును 1802లో మాథ్యూ ఫ్లిండర్స్ గుర్తించారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. సరస్సులోని నీటిని పాత్రలో తీసుకున్నా గులాబీ రంగు అలాగే ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ ఉప్పు తవ్వకాలు జరిగేవి. అయితే, ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఉప్పు శాతం తగ్గి గులాబీ రంగు కొంత మసకబారింది. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే మళ్లీ రంగు తిరిగి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2.హట్ లగూన్: ఆస్ట్రేలియా

Advertisement

ఆస్ట్రేలియాలోని మరో అద్భుతం హట్ లగూన్. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతను బట్టి ఈ సరస్సు రంగు మారుతూ ఉంటుంది. గులాబీ, లేత ఎరుపు, కొన్నిసార్లు ఊదా రంగులో కూడా కనిపిస్తుంది. వేసవిలో ఉప్పు పొరలు సరస్సు అంచుల్లో తెల్లగా మెరిసిపోవడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

3.డస్టీ రోజ్ సరస్సు: కెనడా

ఇతర గులాబీ సరస్సులతో పోలిస్తే డస్టీ రోజ్ సరస్సు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఉప్పునీటి సరస్సు కాదు. హిమానీనదాల నుంచి వచ్చే నీరు గులాబీ, ఊదా రంగు ధూళిని వెంట తీసుకురావడంతో ఈ సరస్సు గులాబీ రంగులో కనిపిస్తుంది. ఇక్కడ సూక్ష్మజీవులు కూడా ఉండవు. మారుమూల ప్రాంతంలో ఉండటంతో దీనిని ఎక్కువగా విమాన ప్రయాణం ద్వారానే చూడగలుగుతారు.

4.లేక్ రెట్బా: సెనెగల్

Advertisement

సెనెగల్‌ లోని లేక్ రెట్బా ప్రపంచ ప్రఖ్యాత గులాబీ సరస్సుల్లో ఒకటి. ఒకప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం వేల టన్నుల ఉప్పును సేకరించేవారు. 2022లో వచ్చిన భారీ వరదలతో సరస్సు రంగు మారిపోయినా, ప్రస్తుతం మళ్లీ గులాబీ రంగు క్రమంగా తిరిగి వస్తోంది. వేసవి కాలంలో ఈ సరస్సు అందం మరింత పెరుగుతుంది.

5.టోర్రెవియా పింక్ లగూన్: స్పెయిన్

స్పెయిన్‌ లోని టోర్రెవియా పింక్ లగూన్ కూడా ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ సరస్సు బబుల్‌ గమ్ పింక్ రంగులో మెరిసిపోతుంది. ఇక్కడ ఉప్పునీటి రొయ్యలు ఎక్కువగా ఉండటంతో ఫ్లెమింగో పక్షులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటాయి.

6.మహర్లూ సరస్సు: ఇరాన్

ఇరాన్‌లోని మహర్లూ సరస్సు కూడా ఎక్కువ ఉప్పు కారణంగా గులాబీ రంగులో కనిపిస్తుంది. వేసవి నాటికి నీరు ఎక్కువగా ఆవిరైపోయి తెల్లటి ఉప్పు పొర మాత్రమే మిగులుతుంది. వసంతకాలంలో మాత్రం ఈ సరస్సు గులాబీ రంగులో అత్యంత అందంగా కనిపిస్తుంది.

గులాబీ రంగు ఎలా వస్తుంది?

ఈ రంగు వెనుక ఎలాంటి మాయ లేదు. ప్రకృతిలో జరిగే జీవ, రసాయన ప్రక్రియలే దీనికి కారణం. ఎక్కువ ఉప్పు ఉన్న సరస్సుల్లో పెరిగే డునాలియెల్లా సాలినా అనే శైవలం, సాలినీబాక్టర్ రూబర్ లాంటి సూక్ష్మజీవులు ఎరుపు వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. అదే నీటికి గులాబీ లేదా ముదురు ఎరుపు రంగును ఇస్తుంది.

Read Also: ఊసరవెల్లిలా రంగులు మార్చే పర్వతం..నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం!

Related News

హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

ఇండియన్ రైల్వేలో రారాజు.. ఈ ట్రైన్ వస్తే మిగతావన్నీ పక్కకు వెళ్లాల్సిందే!

అందాల రాణి క్లియోపాత్రా ఎలా చనిపోయింది? ఇప్పటికీ మిస్టరీనే!

అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!

500 ఏళ్ల నాటి సమాధి తెరవగానే వరుస మరణాలు.. రాజు శాపమే ప్రాణాలు తీసిందా?

బ్రిటిష్ ఇంజనీరింగ్ అద్భుతాలు.. దేశానికే గర్వకారణమైన 7 వింటేజ్ రైల్వే స్టేషన్లు!

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక, ఇక్కడ సమాధులు కూడా కళాఖండాలే!

మాజీ ప్రేమికులు కలిసే స్పెషల్ మార్కెట్.. భార్యలే ‘వెళ్లి రా’ అంటారట!

Big Stories

Advertisement
×